ఏపీ ఉప ముఖ్యమంత్రిగా విపరీతమైన పని ఒత్తిడిలో ఉన్న పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటన్న సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు, ఓజి తర్వాత డేట్లు ఎప్పుడు ఇస్తారా అని టీమ్ మొత్తం ఎదురు చూస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై శ్రీలీల హీరోయిన్ గా రూపొందుతున్న ఈ పోలీస్ డ్రామాకు సంబంధించిన కొన్ని విశేషాలను దర్శకుడు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ ప్రమోషన్లలో భాగంగా పంచుకున్నారు. అందులో ప్రధానమైంది ఇది విజయ్ తమిళ సినిమా తేరి రీమేకని తెలిసినప్పుడు వచ్చిన వ్యతిరేకత. ఆషామాషీగా రాలేదట.
2 లక్షల 68 వేల నెగటివ్ ట్వీట్లు కేవలం ఈ ప్రాజెక్టు ఆపడం కోసమే సోషల్ మీడియాలో పోస్టయ్యాయని, అంతగా ఇది ఆగిపోవాలని కోరుకున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారని అప్పుడు తెలిసింది. అయితే టీజర్ చూశాక ఎవరైతే నెగటివ్ కామెంట్స్ చేశారో వాళ్లే సారీ చెప్పి థాంక్స్ అందించడం కూడా గుర్తు చేసుకున్నారు హరీష్. రీమేకుల విషయంలో తాను తీసుకునే శ్రద్ధ అలా ఉంటుందని, మిస్టర్ బచ్చన్ లోనూ 70 శాతానికి పైగా ఛేంజ్ చేశానని, మంచి లవ్ స్టోరీని పొందుపరిచి రవితేజ మాస్ ఎనర్జీని పూర్తి స్థాయిలో వాడుకుని ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుందని హామీ ఇచ్చారు.
వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో ఇలా వరసగా పవన్ రీమేకుల మీద ఆధారపడటంతో ఫ్యాన్స్ అప్పట్లో కొంత అసహనానికి గురైన మాట వాస్తవమే. అందులో భాగంగానే ఉస్తాద్ భగత్ సింగ్ వద్దనుకున్నారు. కానీ టీజర్ లో చూపించిన డైలాగుల తర్వాత వాళ్ళ అభిప్రాయాలు మారిపోయాయి. ప్రస్తుతానికి కేవలం ఇరవై శాతం మాత్రమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఉస్తాద్ భగత్ సింగ్ 2025లో రిలీజయ్యే ఛాన్స్ లేదు. ముందు వీరమల్లు ఆ తర్వాత ఓజి వస్తాయి కాబట్టి 2026లో ఉస్తాద్ దర్శనం చేసుకోవచ్చు. ఈలోగా హరీష్ శంకర్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఒక మూవీ పూర్తి చేసే పనిలో ఉన్నారు.
This post was last modified on August 8, 2024 5:25 pm
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…