‘జాతిరత్నాలు’ సినిమాతో సంచలనం రేపిన దర్శకుడు అనుదీప్ కేవీ. దాని కంటే ముందు అతను ‘పిట్టగోడ’ అనే చిన్న సినిమా తీసిన సంగతి జనాలకు పెద్దగా తెలియదు. కానీ ‘జాతిరత్నాలు’తో అనుదీప్ పేరు మార్మోగిపోయింది. ఇలాంటి కామెడీని తెలుగు తెరపై అంతవరకు చూడలేదు. హీరోలను అంత డంబ్‌గా చూపిస్తూ.. సిల్లీగా అనిపిస్తూనే భలేగా నవ్వించాయి అందులోని కామెడీ సీన్స్.
‘జాతిరత్నాలు’ తర్వాత అనుదీప్ మీద అంచనాలు భారీగా పెరిగాయి కానీ.. ‘ప్రిన్స్’తో వాటిని అందుకోలేకపోయాడు. తమిళ, తెలుగు భాషల్లో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలైంది. ఈ సినిమా విడుదలై రెండేళ్లు కావస్తున్నా అనుదీప్ మరో సినిమాను మొదలుపెట్టకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. రవితేజతో అని ఇంకో హీరోతో అని అనుదీప్ కొత్త చిత్రం గురించి రకరకాల ప్రచారాలు జరిగాయి. కానీ ఆ ప్రచారాలేవీ నిజం కాలేదు.
ఐతే ఎట్టకేలకు అనుదీప్ కొత్త చిత్రం ఖరారైంది. దాని గురించి అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. యువ కథానాయకుడు విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో అనుదీప్ తన కొత్త చిత్రం చేయబోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ బేనర్ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. విశ్వక్‌కు ఇది 14వ సినిమా. ఈ చిత్రానికి పని చేసే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలేవీ వెల్లడించలేదు. త్వరలోనే క్లారిటీ వస్తుంది.
అనుదీప్, విశ్వక్‌లది క్రేజీ కాంబినేషన్ అవుతుందనడంలో సందేహం లేదు. ఈసారి అనుదీప్ తన మార్కు కామెడీనే ట్రై చేస్తాడేమో చూడాలి. ఐతే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్ మీద మాత్రం ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని వేశారు. మరి అనుదీప్ కుటుంబ కథా చిత్రం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం.
This post was last modified on August 8, 2024 2:51 pm
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…