వచ్చే వారం విడుదల కాబోతున్న డబుల్ ఇస్మార్ట్ ఫలితం పట్ల టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ప్రమోషన్లు నాన్ స్టాప్ గా చేస్తూనే ఉన్నారు. మిస్టర్ బచ్చన్ రూపంలో మంచి పోటీ ఉండటంతో బాక్సాఫీస్ వసూళ్లలో టాక్ చాలా కీలక పాత్ర పోషించనుంది. లాంగ్ వీకెండ్ కావడంతో బాగుందనే మాట బయటికి వస్తే చాలు కలెక్షన్ల వర్షం ఖాయమే. అందులోనూ ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ కి కొనసాగింపు, సంజయ్ దత్ విలనిజం ఇలా బోలెడు అంశాలు మాస్ ని టార్గెట్ చేసుకుని విందు భోజనానికి సిద్ధం కమ్మంటున్నాయి. 2 గంటల 42 నిమిషాల నిడివికి సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది.
ఇదిలా ఉండగా డబుల్ ఇస్మార్ట్ సినిమా నలుగురి కెరీర్లకు సంబంధించి అతి ముఖ్యమైన మైలురాయిగా నిలవాల్సిన బాధ్యతను తీసుకుంది. హీరో రామ్ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ లో ఉన్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ది వారియర్, స్కందలు తీవ్రంగా నిరాశపర్చడంతో తన ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులను డబుల్ ఇస్మార్ట్ పూర్తి స్థాయిలో ఆకట్టుకుందనే ధీమా తనలో కనిపిస్తోంది. లైగర్ గాయాలు ఇంకా వెంటాడుతున్న దర్శకుడు పూరి జగన్నాథ్ మీద హీరోల్లో మళ్ళీ నమ్మకం రావాలంటే ఇప్పుడీ సినిమా మాములు హిట్ అయితే సరిపోదు. వింటేజ్ పూరి అనిపించే సక్సెస్ దక్కాలి.
ఇక మణిశర్మకు కీలక బ్రేక్ ఇవ్వాల్సిన బాధ్యతని డబుల్ ఇస్మార్ట్ తీసుకుంది. అవకాశాలు ఎన్ని వస్తున్నా మునుపటి స్థాయిలో ఆల్బమ్ ఇవ్వలేకపోతున్నారనే లోటుని ఇది తీరుస్తుందనే నమ్మకం యూనిట్ లో ఉంది. హీరోయిన్ కావ్య థాపర్ కు ఊరుపేరు భైరవకోన రూపంలో డీసెంట్ హిట్ ఉన్నప్పటికీ ఆఫర్లు క్యూ కట్టే స్థాయిలో ఇంకా మలుపు దక్కలేదు. సో ఇది తనకూ చాలా కీలకం. గుంటూరు కారం, టిల్లు స్క్వేర్ తర్వాత క్లాసు మాసుని ఏకకాలంలో థియేటర్లకు రప్పించిన సినిమాలు ఆ తర్వాత పెద్దగా లేవు. సో డబుల్ ఇస్మార్ట్ కనక ఈ విషయంలో మెప్పించగలిగితే అందరి లోటు తీరినట్టే.
This post was last modified on August 8, 2024 12:42 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…