మెగాస్టార్ కోసం 3 ఏళ్ళు కష్టపడ్డ మెహర్ రమేష్

మెహర్ రమేష్… యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘బిల్లా’ లాంటి స్టయిలిష్ బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించారు. సినిమాల ఫలితాల సంగతెలా ఉన్నా స్టైలిష్ మేకర్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు. మెగాఫోన్‌కు కొంతకాలం దూరమైన రమేష్ త్వరలో ఓ మెగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వేదాళం రీమేక్ చేయబోతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్‌కు, తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఆ కథను మెహర్ రమేష్ మార్చారు. ఇందుకోసం మూడేళ్ల పాటు ఆయన కష్టపడ్డారు. ఆయన పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. మెహర్ రమేష్ చేసిన మార్పులు నచ్చడంతో చిరంజీవి ఆ సినిమా చేయడానికి అంగీకరించారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. ఈ సినిమా గురించి పవన్ కల్యాణ్ ఇటీవల ట్విటర్ ద్వారా స్పందించారు. తాజాగా చిరంజీవి కూడా ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ మెహర్ రమేష్ తో సినిమా చేయబోతున్నట్టు కన్ఫామ్ చేశారు. ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ కావాలని మెహర్ రమేష్ చాలా పట్టుదలగా ఉన్నారు. త్వరలోనే ఆయన కోరిక నెరవేరనుంది.

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)