మెగా అభిమానులు ఇప్పుడు వర్గాలుగా విడిపోయారు. మిగతా ఫ్యాన్స్ అంతా ఒక వైపుంటే.. అల్లు అర్జున్ అభిమానులు మరోవైపు ఉన్నారు. బన్నీ పేరెత్తితే చాలు ఓ వర్గం అభిమానులు మంటెత్తిపోతున్నారు. ‘సరైనోడు’ సినిమా ఈవెంట్లో ‘చెప్పను బ్రదర్’ కామెంట్‌తో మొదలైన గొడవ.. ఇటీవల ఏపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అయిన శిల్పా రవికి బన్నీ ప్రచారం చేయడంతో పతాక స్థాయికి చేరుకుంది. ఎప్పుడూ లేని స్థాయిలో మెగా అభిమానుల్లో రెండు వర్గాల మధ్య ఒక అగాథం ఏర్పడింది. అది కుటుంబ స్థాయిలో కూడా విభేదాలకు దారి తీసిందనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
శిల్పా రవి కోసం బన్నీ ప్రచారానికి వెళ్లినపుడు అతడిని పరోక్షంగా విమర్శిస్తూ నాగబాబు పెట్టిన ఓ ట్వీట్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తర్వాత దాన్ని ఆయన డెలీట్ చేసినా సరే.. మెగా ఫ్యామిలీలో కోల్డ్ వార్‌కు ఇది సంకేతాలా కనిపించింది. మెగా అభిమానుల్లోని ఒక వర్గం బన్నీ మీద మరింత మంటెత్తిపోతుండడానికి నాగబాబు కారణమనే చర్చ సామాజిక మాధ్యమాల్లో జరిగింది.
ఇలాంటి టైంలో బన్నీ మీద నాగబాబు పాజిటివ్ కామెంట్ చేయడం సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షించింది. తాజాగా అభిమానులతో చిట్ చాట్ సందర్భంగా.. ఒక నెటిజన్ నాగబాబును బన్నీ గురించి అభిప్రాయం చెప్పమని అడిగాడు. అందుకాయన బదులిస్తూ బన్నీ కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి అని.. అతను నటించిన పుష్ప-2 సినిమా కోసం తాను ఎదురు చూస్తున్నానని అన్నాడు. తనకు తానుగా బన్నీ గురించి ఈ కామెంట్ చేయకపోయినా.. అభిమాని అడిగితే తన గురించి సానుకూలంగా మాట్లాడడంతో మెగా అభిమానుల్లో గొడవల్ని కొంచెం సద్దుమణిగేలా చేస్తుందని భావిస్తున్నారు.
బన్నీ వాసు కోరుకున్నట్లు ఫ్యామిలీలో అందరూ కలిసి పోవడానికి, అభిమానులకు సానుకూల సంకేతాలు ఇవ్వడానికి ఒక మూమెంట్ చాలు. ఇది అంత పెద్ద మూమెంట్ కాకపోయినా.. నాగబాబు చేసిన కామెంట్ మంచిదే. త్వరలో ఏదైనా ఫ్యామిలీ ఈవెంట్లో అందరూ కలిసి కనిపిస్తే వ్యవహారం పూర్తిగా సద్దుమణుగుతుందని భావిస్తున్నారు.
This post was last modified on August 6, 2024 9:36 pm
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. సమీపంలోనే జరగబోయే మూడు ఐపీఎల్ సీజన్ల తేదీలను ముందుగానే…
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా…
టీడీపీ సీనియర్ నాయకురాలు, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత… రాజకీయంగా చర్చనీయాంశం అయ్యారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి…
గేమ్ ఛేంజర్ ఇంకా విడుదలే కాలేదు రామ్ చరణ్ అప్పుడే తన తదుపరి సినిమాను పట్టాలెక్కించేశాడు. సుకుమార్ ప్రియ శిష్యుడు…
తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న పార్టీ మార్పుల కేసులో హైకోర్టు సీజే ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. బీఆర్ఎస్…