శ్రీదేవి లాంటి ఆల్ టైం గ్రేట్ హీరోయిన్ వారసురాలిగా అడుగు పెట్టి ఒక స్థాయి అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఇలాంటి లెజెండరీ పర్సనాలిటీస్ వారసులను ప్రేక్షకులు ఎక్కువ అంచనాలతో చూస్తారు. వాటిని మ్యాచ్ చేయడం కష్టమవుతుంది.
ఐతే నటిగా శ్రీదేవిని అందుకోవడం కష్టం కానీ.. గ్లామర్ కోణంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి జాన్వి గట్టిగానే ట్రై చేస్తోంది. ఫొటో షూట్లతో చేసే గ్లామర్ విందుతో సోషల్ మీడియాలో ఇప్పటికే ఆమె తనకంటూ భారీ ఫాలోయింగ్ సంపాదించింది జాన్వి.
ఇక నటిగా ముద్ర వేయడమే మిగిలుంది. ఐతే జాన్వి నటించిన సినిమాల్లో ధడక్ మినహా ఏదీ పెద్దగా ఆడలేదు. తన కొత్త చిత్రం ఉలఝ్ కూడా ఫ్లాపే అయింది. ఐతే టాలీవుడ్లో మాత్రం ఆమె క్రేజీ ప్రాజెక్టులతో బలమైన ముద్ర వేయడానికి చూస్తోంది. ఓవైపు జూనియర్ ఎన్టీఆర్‌తో దేవర చేస్తూనే.. మరోవైపు రామ్ చరణ్‌తో సినిమా కమిటైంది.
ముందుగా దేవర మీద అందరి చూపులూ నిలిచి ఉన్నాయి. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఈ రోజే లాంచ్ చేశారు. శ్రావ్యంగా సాగిన ఈ డ్యూయెట్ విజువల్‌గా కూడా ఎంతగానో ఆకట్టుకుంది. పాటలో తారక్‌ను మించి జాన్వినే హైలైట్ అయిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అందుకు తన గ్లామరే కారణం. లంగావోణీలోనే కాక దేవకన్య డ్రెస్‌లోనూ జాన్వి వారెవా అనిపించింది. దర్శకుడు, కెమెరామన్ కూడా జాన్వి మీద బాగానే ఫోకస్ పెట్టారని విజువల్స్ చూస్తే అర్థమవుతుంది.
ఈ పాట లాంచ్ అవ్వడం ఆలస్యం.. జాన్వి అందాలకు సంబంధించిన విజువల్స్ కట్ చేసి ఆ వీడియోలను వైరల్ చేస్తున్నారు కుర్రాళ్లు. జాన్వి పేరు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాట థియేటర్లలో కుర్రకారుకు కనువిందు చేసేలా కనిపిస్తోంది. ఈ సినిమాకు ప్రేక్షకులను ఆకర్షించడంలో జాన్వి తన వంతు పాత్ర పోషించబోతోందనడంలో సందేహం లేదు. నటిగా కూడా తనదైన ముద్ర వేస్తే ఆమెకు టాలీవుడ్లో తిరుగులేనట్లే.
This post was last modified on August 5, 2024 10:34 pm
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…