సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి రూపొందించే సినిమాపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాకు స్క్రిప్ట్, ప్రి ప్రొడక్షన్ పనులు సుదీర్ఘ కాలంగా నడుస్తున్నాయి. తన చివరి చిత్రం ఆర్ఆర్ఆర్ రిలీజై రెండేళ్లు దాటినా.. మహేష్ సినిమాను ఇంకా సెట్స్ మీదికి తీసుకెళ్లలేదు. కథ ఒక కొలిక్కి వచ్చాక ప్రి ప్రొడక్షన్, నటీనటులు-సాంకేతిక నిపుణులు ఎంపిక జరుగుతోంది.
ఈ క్రమంలోనే ఈ చిత్రంలో విలన్ పాత్రకు తమిళ విలక్షణ నటుడు విక్రమ్‌ను ఎంచుకున్నట్లుగా కొన్నాళ్ల కిందట ఓ వార్త హల్ చల్ చేసింది. కానీ దాని గురించి ఎవరూ స్పష్టత ఇవ్వలేదు. ఇలాంటి వార్తలు నిజమైనా, కాకపోయినా ప్రి ప్రొడక్షన్ దశలో రాజమౌళి అండ్ టీం స్పందించరు కాబట్టి కొన్ని రోజుల తర్వాత దాని గురించి అంతా మరిచిపోయారు. ఇంతకీ విక్రమ్ ఈ చిత్రంలో నటిస్తున్నాడా లేదా అన్నది సస్పెన్సుగానే ఉండిపోయింది.
ఐతే తన కొత్త చిత్రం తంగలాన్ ప్రమోషన్ల కోసం హైదరాబాద్‌కు వచ్చిన విక్రమ్‌కు మహేష్-రాజమౌళి సినిమాకు సంబంధించి ప్రశ్న ఎదురైంది. ఇందులో మీరు నటిస్తున్నారా అని అడిగితే.. అతను సూటిగా సమాధానం చెప్పలేదు. రాజమౌళితో తనకు స్నేహం ఉందని.. కలిసి సినిమా చేయడం గురించి చాన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయని విక్రమ్ చెప్పాడు.
తామిద్దరం కలిసి ఏదో ఒక రోజు సినిమా చేస్తామని.. అది ఏ సినిమా అనేది మాత్రం చెప్పలేనని విక్రమ్ అన్నాడు. ఇలా రెండు మూడు ముక్కలు మాట్లాడి వేరే ప్రశ్నలోకి వెళ్లిపోయాడు. ఐతే విక్రమ్ మాటల్ని బట్టి చూస్తుంటే మహేష్ సినిమా కోసం అతడితో సంప్రదింపులు జరుగుతున్న మాట వాస్తవమే అనిపిస్తోంది. ఆ సినిమాలో నటించట్లయితే.. అది నిజం కాదని తేల్చేసి ఉండొచ్చు. ఒకవేళ ఆ వార్త నిజమే అయినా ప్రొడక్షన్ హౌస్ ప్రకటించకుండా తాను ఆ విషయాన్ని ధ్రువీకరించడం కరెక్ట్ కాదు కాబట్టి సూటిగా సమాధానం ఇవ్వకపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.
This post was last modified on August 6, 2024 11:09 am
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…