కొన్ని వారాల ముందు ‘పుష్ప-2’ సినిమాకు సంబంధించి నెగెటివ్ న్యూస్‌లు సోషల్ మీడియాలో ఎంతగా హల్‌చల్ చేశాయో తెలిసిందే. ఈ సినిమా షూట్ పదే పదే క్యాన్సిలవుతుండటం, డిసెంబరులో కూడా సినిమా రిలీజయ్యేలా లేకపోవడంతో దర్శకుడు సుకుమార్ మీద, నిర్మాతల మీద అల్లు అర్జున్ అలిగాడని.. నిరసనగా గడ్డం తీసేసి ఫారిన్ వెకేషన్‌కు వెళ్లిపోయాడని జోరుగా వార్తలు వచ్చాయి. మరోవైపు సుకుమార్ అమెరికా వెళ్లిపోవడంతో ‘పుష్ప-2’ టీంలో ఏం జరుగుతోందనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది.
ఐతే సుకుమార్ తన కూతురి కోర్సుకు సంబంధించి యుఎస్ వెళ్లివచ్చాడని.. బన్నీ మామూలుగానే బ్రేక్ తీసుకున్నాడని.. ఇద్దరి మధ్య గొడవలేం లేవని.. ‘పుష్ప-2’ షూట్ ప్రణాళిక ప్రకారమే జరుగుతోందని టీం మీడియాకు అనధికారికంగా క్లారిటీ ఇచ్చింది.
తర్వాత సుకుమార్ యుఎస్ నుంచి వచ్చాడు. బన్నీ వెకేషన్లోనే ఉండడంతో వేరే ఆర్టిస్టుల కాంబినేషన్లో చిత్రీకరణ కొనసాగించాడు. ఐతే ఎట్టకేలకు బన్నీ వెకేషన్ ముగించుకుని ఆదివారమే షూట్లో అడుగుపెట్టాడని తెలిసింది. బన్నీ మీద తీయాల్సినవి క్లైమాక్స్ ఫైట్, ఓ పాట మాత్రమే అన్నది చిత్ర వర్గాల సమాచారం.
ఆదివారం ఒక భారీ సెట్లో క్లైమాక్స్ చిత్రీకరణ మొదలైంది. తొలి రోజు చాలా వరకు రిహార్సల్స్‌కే టీం పరిమితమైంది. తిరిగి ‘పుష్ప-2’ సెట్స్‌లోకి అడుగుపెట్టిన సందర్భంగా సుకుమార్‌తో బన్నీ చాలా ఫ్రెండ్లీగానే ఉన్నాడన్నది యూనిట్ వర్గాల సమాచారం. నిజంగా వీళ్లిద్దరి మధ్య ఏమైనా జరిగిందో లేదో కానీ.. సెట్లో మాత్రం చాలా సరదాగానే ఉన్నారట. బన్నీ వెకేషన్‌కు వెళ్లే ముందు కొంచెం గడ్డం తీసేశాడు. ఇప్పుడు మేకప్ ద్వారా కొంచెం కవర్ చేసి షూట్‌కు రెడీ చేశారు. ఏకధాటిగా జరిగే ఈ షెడ్యూల్‌తో క్లైమాక్స్ పూర్తవుతుందని.. కొంచెం గ్యాప్ ఇచ్చి పాట చిత్రీకరిస్తారని సమాచారం.
This post was last modified on August 5, 2024 3:16 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…