సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే గ్రేటెస్ట్ యాక్టర్ల జాబితా తీస్తే అందులో విక్రమ్ పేరు కచ్చితంగా ఉంటుంది. కమల్ హాసన్ తర్వాత ఆయన లాగే ప్రయోగాత్మక కథలు, పాత్రలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు విక్రమ్. కొన్నేళ్ల వ్యవధిలో వచ్చిన శివపుత్రుడు, సామి, అపరిచితుడు సినిమాలను చూస్తే అతనెంత వైవిధ్యమైన నటుడో అర్థమవుతుంది.
ఇలాంటి పూర్తి భిన్నమైన మూడు సినిమాలు చేసి మూడింటితోనూ బ్లాక్‌బస్టర్లు కొట్టడం అతడికే చెల్లింది. కాకపోతే ఆ హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్ల తర్వాత విక్రమ్‌కు ఇప్పటిదాకా సరైన సక్సెస్ లేదు. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూనే ఉన్న విక్రమ్ కు తాను కోరుకున్న విజయం మాత్రం దక్కట్లేదు. ఇప్పుడు అతను ‘తంగలాన్’ అనే మరో వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఈ సినిమా ప్రమోషన్ల కోసం హైదరాబాద్‌కు వచ్చిన విక్రమ్.. ఒక ఆసక్తికర విషయం వెల్లడించాడు. షూటింగ్ జరుగుతున్నపుడు ఒక సన్నివేశం కాగానే మానిటర్‌లో తన పెర్ఫామెన్స్ చూసుకునే అలవాటు తనకు లేదని అతను చెప్పాడు. అసలు తాను ఎప్పుడూ మానిటర్ చూడనని అతను వెల్లడించాడు. దాదాపుగా ప్రతి నటుడూ తాను చేసిన సన్నివేశాన్ని మానిటర్‌లో చూసుకోవడం ఇప్పుడు కామన్ ప్రాక్టీస్. కానీ విక్రమ్ అలా చేయడట.
“నాకు మానిటర్ చూసే అలవాటు లేదు. నేరుగా డబ్బింగ్ టైంలోనే విజువల్స్ చూస్తాను. ‘తంగలాన్’ సినిమాలో సన్నివేశాలను ఎప్పుడూ మానిటర్లో చూడలేదు. నేరుగా డబ్బింగ్ టైంలో చూస్తే నేను చేసిన సన్నివేశాలే నాకు షాకింగ్‌గా అనిపించాయి. నా లుక్ నన్ను ఆశ్చర్యపరిచింది. రేప్పొద్దున ప్రేక్షకులు కూడా నాలాగే షాకవుతారు. చాలామంది ఇది కేజీఎఫ్ తరహా సినిమా అనుకున్నారు. కానీ ఈ సినిమా ప్రోమోలు వచ్చాక ఆశ్చర్యపోయారు. సినిమా కూడా షాకింగ్‌గా ఉంటుంది” అని విక్రమ్ తెలిపాడు.
This post was last modified on August 5, 2024 1:12 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…