ఎప్పుడో ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం విడుదలైన సినిమా మళ్ళీ థియేటర్లకు వస్తే జనం చూడటంలో ఆశ్చర్యం లేదు కానీ కొత్త రిలీజులతో పోటీ పడుతూ ట్రెండింగ్ లోకి రావడం మాత్రం అనూహ్యం. గత ఇరవై నాలుగు గంటల్లో టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడి, మురారి రెండు చిత్రాలకు ఇంచుమించు ఒకే స్థాయిలో 40 వేలకు దగ్గరలో బుక్ మై షో టికెట్లు అమ్ముడుపోవడం చూసి అభిమానులే ఆశ్చర్యపోతున్నారు. ఈ నెంబర్ దరిదాపుల్లో బాలీవుడ్ మూవీస్ జాన్వీ కపూర్ ఉలజ్, అజయ్ దేవగన్ ఆరోన్ మే కహా ధం తాలు లేకపోవడం గమనించాల్సిన విషయం. మురారికి ఇంకా అయిదు రోజుల టైం ఉంది.
కల్కి ఇప్పటికే ముప్పై ఎనిమిది రోజులు పూర్తి చేసుకున్నా వీకెండ్స్ లో మాత్రం ఆధిపత్యం చూపిస్తూనే ఉంది. మరోవైపు మొన్న శుక్రవారం రిలీజైన బడ్డీ, శివమ్ భజే, ఉషా పరిణయం, అలనాటి రామచంద్రుడు, తిరగబడరా సామీ వగైరాలు కనీస స్థాయిలో టికెట్లు అమ్ముడుపోక దిక్కులు చూస్తున్నాయి. చాలా చోట్ల కనీసం థియేటర్ ఖర్చులు వచ్చేంత కలెక్షన్ కూడా లేకపోవడంతో షోలు క్యాన్సిలవుతున్నాయి. ఇంకొన్ని చోట్ల వీటిని తీసేసి మళ్లీ కల్కినే వేసుకుని అంతో ఇంతో వసూళ్లు తెచ్చుకున్న ప్రయత్నంలో ఉన్నారు. అసలు షాక్ మాత్రం మురారి రూపంలో కనిపిస్తోంది.
ఇప్పుడే ఇలా ఉంటే గురువారం నాటికి మురారి కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా ఉంది. ఆ రోజు వచ్చే కొత్త సినిమాలకు ఇదో గండంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నీహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్ళుతో పాటు అనసూయ సింబ లాంటి కొన్ని నోటెడ్ మూవీస్ ఆ రోజు వస్తున్నాయి. ఆగస్ట్ 9న డిమాండ్ సప్లై సూత్రం ప్రకారం చూసుకుంటే మురారినే టాప్ ప్లేస్ లో కనిపిస్తోంది. ఇది ఒక్క మహేష్ బాబుకే సాధ్యమంటూ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. చూస్తుంటే రీ రిలీజుల్లో గతంలో వచ్చిన రికార్డులు మురారితో స్మాష్ అయ్యేలా ఉన్నాయి. అంత క్రేజ్ వచ్చేసింది మరి.
This post was last modified on August 5, 2024 10:49 am
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి విచిత్రంగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కీలకమైన సమయం లో ఆయన మౌనంగా ఉంటూ..…
నాగచైతన్య కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న తండేల్ నుంచి నిన్న మొదటి ఆడియో సింగల్ రిలీజయ్యింది. అక్కినేని…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి.. ఇప్పుడు అంతా తానై వ్యవహరిస్తున్నారు మాజీ మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ.…
క్రికెట్ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్ ను అంత ఈజీగా ఎవరు మర్చిపోలేరు. ప్రత్యర్థి బౌలర్లకు నిద్రలేకుండా చేసిన ఈ అగ్రశ్రేణి…
టాలీవుడ్ ప్రేమికుల కోసం కొత్త శుక్రవారం సిద్ధమయ్యింది. ఈ రోజు రిలీజవుతున్న వాటిలో ప్రధానంగా మూడు సినిమాలు ఆడియన్స్ దృష్టిలో…
గత కొన్ని నెలలుగా ఆన్ లైన్ వేదికగా మెగాభిమానులు వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న రగడ చూస్తూనే ఉన్నాం.…