దశాబ్దం పైగానే హీరోయిన్ గా చెలామణి అవుతున్న త్రిష ఇప్పటికీ తన డిమాండ్ కొనసాగిస్తూనే ఉంది. పొన్నియిన్ సెల్వన్ పుణ్యమాని స్టార్ హీరోలందరూ కోరిమరీ అవకాశాలు ఇస్తున్నారు. ఒకేసారి చిరంజీవి, కమల్ హాసన్, విజయ్, అజిత్ లాంటి వాళ్ళకు జోడి కావడమంటే మాములు విషయం కాదు. అలాంటిది త్రిష మొదటిసారి ఒక వెబ్ సిరీస్ చేసిందంటే ఆసక్తి కలగడం సహజం. అదే బృంద. సోని లివ్ ద్వారా ఈ వారం నుంచే స్ట్రీమింగ్ అవుతున్న ఈ క్రైమ్ డ్రామాకు ట్రైలర్ వచ్చాక అంచనాలు మొదలయ్యాయి. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో 5 గంటల 36 నిమిషాల నిడివి ఉన్న బృంద ఎలా ఉందో చూద్దాం.
ఎస్ఐగా కొత్తగా ఉద్యోగంలో చేరిన బృంద (త్రిష)కు తను అమ్మాయి కావడంతో సహచరుల నుంచి పెద్దగా సహకారం ఉండదు. ఊరి బయట చెరువులో ఒక శవం దారుణమైన స్థితిలో కనిపిస్తుంది. తొలుత అందరూ ఆత్మహత్యగా భావించినా బృంద తీసుకున్న చొరవ వల్ల అది హత్యని తెలుస్తుంది. లోతుగా తవ్వేకొద్దీ ఏకంగా 16 మంది ఇదే స్థితిలో మర్డరయ్యారని బృంద కనిపెట్టి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో భాగమవుతుంది. సైకో కిల్లర్ జాడ ఎంత వెతికినా దొరకదు. కొలీగ్ (రవీంద్ర విజయ్) సహాయంతో విచారణని తీవ్రం చేస్తుంది. ఈ క్రమంలోనే మతిపోయే వాస్తవాలు బయటికి వస్తాయి. అదే అసలు స్టోరీ.
దర్శకుడు సూర్య మనోజ్ వంగల పాతాల్ లోక్, అనుకోకుండా ఒక రోజు లాంటి క్రైమ్ డ్రామాలను స్ఫూర్తిగా తీసుకుని బృందను రూపొందించాడు. సన్నివేశాలు మొదట్లో మెల్లగా కదిలినట్టు అనిపించినా రెండో ఎపిసోడ్ నుంచే వేగం అందుకుంటుంది. కిల్లర్ ని ఎక్కువసేపు దాచకుండా త్వరగా రివీల్ చేసి ఆపై అతన్ని ఎలా పట్టుకుంటారనే ఆసక్తి రేపడంలో మనోజ్ సక్సెసయ్యాడు. హంతకుడు ఒకడు కాదు ఇద్దరనే ట్విస్టుని సరైన సమయంలో విప్పడం ద్వారా థ్రిల్ ఫ్యాక్టర్ పెరిగింది. చివరి మూడు భాగాల్లో కొంత ల్యాగ్ వచ్చేసినా అక్కడక్కడా ఫార్వార్డ్ చేసుకుంటూ నిక్షేపంగా చూసేయొచ్చు.
త్రిష మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. కుటుంబాన్ని, వృత్తిని బ్యాలన్స్ చేసే ఒత్తిడిని ఎదురుకున్న తీరులో మంచి నటన కనబరిచింది. రవీంద్ర విజయ్, ఆమని, జయప్రకాష్ లు తమకిచ్చిన నిడివికి పూర్తి న్యాయం చేకూర్చారు. ఆనంద సామీ, ఇంద్రజిత్, రాకేందు మౌళి తదితరులు పర్ఫెక్ట్ గా నప్పారు. శక్తి కాంత్ కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆవసరం లేకపోయినా పాటలు ఇరికించడం బాలేదు. పద్మావతి స్క్రీన్ ప్లేకి ప్రశంసలు దక్కుతాయి. డైలాగులు ఓకే. శవాలకు సంబంధించిన కొన్ని క్లోజ్ అప్ షాట్స్ తప్ప ఎక్కడా ఇబ్బంది అనిపించే అసభ్యత కానీ, డబుల్ మీనింగ్స్ కానీ ఏమి లేకపోవడం బృందకు ప్లస్ పాయింట్ గా నిలిచింది.
This post was last modified on August 3, 2024 2:27 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…