Movie News

భేష్….100 రూపాయలకే కల్కి

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడి విడుదలై ముప్పై అయిదు రోజులు పూర్తయ్యింది. అర్ధ శతదినోత్సవానికి దగ్గరగా ఉన్న తరుణంలో థియేట్రికల్ రన్ దాదాపు క్లైమాక్స్ కు చేరుకుంది. వీకెండ్స్ మినహాయించి మాములు రోజుల్లో ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోయాయి. దీనికో తరుణోపాయం పట్టుకుంది వైజయంతి సంస్థ. ఆగస్ట్ 2 నుంచి 9 దాకా ఒక వారం రోజుల పాటు ఈ విజువల్ గ్రాండియర్ ని ఇండియా వైడ్ ఎక్కడైనా ఎందులో అయినా కేవలం 100 రూపాయలకే చూసేయొచ్చు. ఎలాగూ బాక్సాఫిస్ దగ్గర చెప్పుకోదగ్గ సినిమాలు లేవు కాబట్టి హాలు దాకా కల్కికివెళ్లని ఆడియన్స్ కి ఇదో మంచి ఛాన్స్.

అంతా అయిపోయాక ఇప్పుడెందుకనే డౌట్ రావొచ్చు. రిలీజైన టైంలో ప్రతి టికెట్ మీద నూటా ఇరవై రూపాయల దాకా హైక్ తీసుకున్న కల్కి సహజంగానే కామన్ ఆడియన్స్ కి కొంత దూరమయ్యింది. రెండు వారాలయ్యాక సాధారణ రేట్లు అమలులోకి వచ్చాక చూసిన పబ్లిక్ భారీగా ఉన్నారు. అయినా సరే ఓటిటిలో చూద్దామని ఆగిన వాళ్ళ సంఖ్య తక్కువేమీ కాదు. ఇప్పుడు జస్ట్ హండ్రెడ్ రూపీస్ అన్నారు కాబట్టి నలుగురు కుటుంబ సభ్యులు వెళ్లినా నాలుగు వందలకు మించి కాదు. సో బ్యాలన్స్ మిగిలిపోయిన జనాన్ని రప్పించేందుకు కల్కి వేసిన తెలివైన ఎత్తుగడగా దీన్ని చెప్పుకోవచ్చు.

ఎలాగూ నార్త్ లోనూ చెప్పుకోదగ్గ బాలీవుడ్ మూవీస్ ఏమి లేవు. బ్యాడ్ న్యూజ్ పర్వాలేదనిపించుకుంది తప్ప సూపర్ హిట్ కాలేదు. కిల్ సక్సెస్ అయినా అద్భుతాలు చేయలేదు. అజయ్ దేవగన్, జాన్వీ కపూర్ ల కొత్త సినిమాలకు అసలు బజ్జే లేదు. సో ఉత్తరాది ఆడియన్స్ ఇలాంటి వంద రూపాయల ఆఫర్లకు ఎక్కువ ఆకర్షితులు అవుతారు కాబట్టి కల్కి నెంబర్లు మళ్ళీ భారీగా పెరిగే అవకాశాన్ని కొట్టి పారేయలేం. అన్నట్టు ధర్మా ప్రొడక్షన్స్ సైతం తమ బ్యాడ్ న్యూజ్, కిల్ లను ఒక్క రోజు 99 రూపాయలకు చూడొచ్చని ఆఫర్ ప్రకటించింది. ఎలా చూసుకున్నా ఈ మోడల్ ఎక్కువ వర్కౌట్ అయ్యేది కల్కికే.

This post was last modified on August 2, 2024 8:17 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దర్శన్‌ను రేణుక స్వామి ఆత్మ వెంటాడుతోందట

ప్లాన్ చేసి చేశారో.. లేక క్షణికావేశంలో చేశారో కానీ.. కన్నడ కథానాయకుడు దర్శన్ తన అభిమానే అయిన రేణుక స్వామి…

4 hours ago

కర్ణుడిగా సూర్య.. అప్డేట్ వచ్చింది

ఇటీవలే ‘కల్కి’ సినిమాలో కాసేపు ప్రభాస్ కర్ణుడిగా కనిపిస్తే.. ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలిసిందే. మహాభారతంలో ఎన్నో…

9 hours ago

ప‌వ‌న్ విమ‌ర్శ‌ల‌కు డీఎంకే కౌంట‌ర్

తిరుమ‌ల ల‌డ్డు వివాదం త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ హిందువులు ఆచ‌రించే స‌నాత‌న ధ‌ర్మం గురించి చాలా బ‌లంగా గ‌ళాన్ని వినిపిస్తున్న…

12 hours ago

లోకేష్ కనకరాజ్‌కు కోపమొచ్చింది

తమిళంలో ప్రస్తుతం టాప్ డైరెక్టర్లలో ఒకడు.. లోకేష్ కనకరాజ్. మామూలుగా అతను చాలా కూల్‌గా కనిపిస్తాడు. అలాంటి దర్శకుడికి ఇప్పుడు…

12 hours ago

శివ ప్రభంజనానికి 35 వసంతాలు

1989 సంవత్సరం. అక్టోబర్ 5వ తేదీ. బ్రేక్ డాన్సులు, ఫైట్లు, భారీ సెట్ల హంగులు ఆర్భాటాలు, అవుట్ డోర్ లొకేషన్ల…

12 hours ago

తిరుమలలో గోవింద నామస్మరణ మాత్రమే వినిపించాలి

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ…

13 hours ago