ఇంకో పధ్నాలుగు రోజుల్లో తంగలాన్ విడుదల కానుంది. చియాన్ విక్రమ్ హీరోగా దర్శకుడు పా రంజిత్ తీసిన ఈ పీరియాడిక్ డ్రామా మీద మూవీ లవర్స్ లో ప్రత్యేకమైన అంచనాలున్నాయి. అదే రోజు ఆగస్ట్ 15 రిలీజవుతున్న మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లు ప్రమోషన్లలో నువ్వా నేనా అనే స్థాయిలో పోటీ పడుతుండగా చిన్న చిత్రమైన ఆయ్ కూడా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అయితే తంగలాన్ మాత్రం ఎలాంటి చప్పుడు చేయడం లేదు. నైజాం ప్రాంతంలో మైత్రి లాంటి పెద్ద సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ముందుకు రావడంతో థియేటర్ల పరంగా టెన్షన్ ఉండకపోవచ్చు.
కానీ విక్రమ్ అభిమానులు ఆందోళన పడుతున్న అంశం మరొకటి ఉంది. చియాన్ విక్రమ్ చాలా కష్టపడి ఒళ్ళు హూనం చేసుకున్న తంగలాన్ తెలుగులో కూడా రీచ్ అవ్వాలి. కానీ ఆ స్థాయిలో పబ్లిసిటీ జరగడం లేదు. మాస్ కి అర్థం కాని విధంగా తమిళ టైటిల్ యధాతథంగా ఉంచేయడం వల్ల బిసి సెంటర్స్ లో దీని మీద ఆసక్తి పుట్టించడం కష్టం. కాదలన్ అంటే ప్రేమికుడు అని పెట్టినట్టు తంగలాన్ అంటే ఏదో తెలుగు పదం వెతకాల్సింది. కానీ ప్యాన్ ఇండియా సాకు చూపించి నిర్మాతలు వాటిని అక్షరం మార్చకుండా ఉంచేయడం వల్ల సమస్య వస్తుంది. సో బజ్ పెరగాలంటే ఏదో జరగాలి.
ఒకవేళ తంగలాన్ తమిళనాడు హిట్టయినా ఇక్కడ ఆడుతుందన్న గ్యారెంటీ లేదు. ఇటీవలే రాయన్ చూశాంగా. అక్కడ వంద కోట్ల గ్రాస్ దాటితే ఇక్కడ తక్కువ బ్రేక్ ఈవెన్ కే కిందా మీదా పడాల్సి వచ్చింది. అలా అని విక్రమ్ మూవీని మరీ తక్కువంచనా వేసినా ప్రమాదమే. గతంలో జీరో హైప్ తో వచ్చిన కాంతార లాంటివి తెలుగులో ఎలాంటి బ్లాక్ బస్టర్ రికార్డులు అందుకున్నాయో సాక్ష్యాలు ఇంకా పచ్చిగా ఉన్నాయి. సో ఇప్పుడే నిర్ధారణకు రాలేం కానీ తంగలాన్ అభిమానులు బెంగ పెట్టుకోవటానికి ప్రధాన కారణాలు ప్రమోషన్లు లేకపోవడం, మాస్ సినిమాల పోటీ విపరీతంగా ఉండటం. ఏమవుతుందో లెట్ సీ.
This post was last modified on August 2, 2024 8:11 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…