స్క్విడ్ గేమ్.. మూడేళ్ల కిందట సంచలనం రేపిన్ వెబ్ సిరీస్. ఈ పేరు వింటే ఓటీటీ ప్రేక్షకుల్లో ఒక రకమైన అలజడి కలుగుతుంది. ఆ కొరియన్ వెబ్ సిరీస్ ఇచ్చిన థ్రిల్, కిక్ అలాంటిలాంటివి కావు. వెబ్ సిరీస్‌ల చరిత్రలోనే అత్యంత ఆదరణ పొంది.. ఓటీటీల్లో వ్యూస్ పరంగా అన్ని రికార్డులనూ బద్దలు కొట్టేసిన ఘనత ఈ సిరీస్ సొంతం. అంతర్జాతీయ స్థాయిలో టాప్ క్వాలిటీ సినిమాలు, సిరీస్‌లకు పెట్టింది పేరైన కొరియా నుంచి వచ్చిన ‘స్క్విడ్ గేమ్’ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్ తీవ్ర ఉత్కంఠకు, ఉద్వేగానికి గురి చేసేదే.
హ్వాంగ్ డాంగ్ హ్యూక్ రూపొందించిన ఈ సిరీస్ చిన్న పిల్లలను సైతం విపరీతంగా ఆకట్టుకుని.. దాని మీద ఎన్నో గేమ్స్ రావడానికి కూడా దోహదం చేసింది. ఈ సిరీస్ చూసిన ప్రతి ఒక్కరూ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ సీజన్ రిలీజైన టైంలోనే సీక్వెల్ కన్ఫమ్ చేసింది చిత్ర బృందం.
ఐతే మూడేళ్లు గడుస్తున్నా ఇంకా ‘స్క్విడ్ గేమ్’ సెకండ్ సీజన్ అప్‌డేట్ లేదేంటని దాని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఐతే ఎట్టకేలకు నెట్‌ఫ్లిక్స్ వాళ్లు సెకండ్ సీజన్ రిలీజ్ డేట్ ప్రకటించారు. డిసెంబరు 26న రెండో సీజన్ స్ట్రీమ్ కాబోతోందట. అంతే కాక ఈ సిరీస్‌కూ మూడో సీజన్ కూడా ఉంటుందనే శుభవార్తను కూడా పంచుకున్నారు.
‘స్క్విడ్ గేమ్’ కాన్సెప్ట్ చాలా షాకింగ్‌గా ఉంటుంది. మల్టీ మిలియనీర్లయిన కొంతమంది.. డబ్బు కోసం తహతహలాడుతున్న వ్యక్తులను ఎంచుకుని ఒక దీవిలోకి తీసుకొచ్చి వాళ్లతో డేంజరస్ గేమ్స్ ఆడిస్తారు. ఈ క్రమంలో తప్పులు చేసిన వాళ్లు వరుసగా ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ డేంజరస్ గేమ్స్ చూసి ఆ మల్టీ మిలియనీర్లు వినోదం పొందుతుంటారు. ఆ గేమ్స్ సాగే వైనం.. తీవ్ర ఉత్కంఠతో ఉంటుంది. ఒక ఎపిసోడ్ మొదలుపెడితే.. అన్నీ చూసేదాకా వదల్లేని థ్రిల్, టెన్షన్ ఉంటుంది ఈ సిరీస్‌లో. తొలి సీజన్ రూపొందించిన డాంగ్ హ్యూక్ రెండో సీజన్ కూడా తీశాడు. మరి రెండో సీజన్ కూడా ఇంతే ఉత్కంఠభరితంగా ఉంటుందేమో చూడాలి.
This post was last modified on August 1, 2024 12:59 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…