అరవిందసమేత వీరరాఘవ తర్వాత సోలో హీరోగా సుదీర్ఘమైన గ్యాప్ వచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ రూపంలో ఆస్కార్ విన్నింగ్ బ్లాక్ బస్టర్ అందుకున్నప్పటికీ అది మల్టీ స్టారర్ కావడంతో ఫ్యాన్స్ ఎదురు చూపులన్నీ దేవర మీదే ఉన్నాయి. సెప్టెంబర్ 27 విడుదల కాబోతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ బిజినెస్ అప్పుడే పీక్స్ కు చేరుకుంటోంది.
ఇప్పటిదాకా వచ్చింది ఒక్క పాటే అయినా హైప్ మాత్రం అమాంతం పెరిగింది. ఇంకో వైపు హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్న తారక్ కేవలం ఏడాది నిడివిలో ఈ రెండు సినిమాలను అభిమానులకు కానుకగా ఇవ్వబోతున్నాడు.
వీటి సంగతి కాసేపు పక్కనపెడితే హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్ దర్శకత్వంలో రెండు భాగాల యాక్షన్ డ్రామాకు జూనియర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తల ఒక్కసాగిగా గుప్పుమనడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేకపోయినా లీకుల రూపంలో గట్టిగానే తిరుగుతోంది. అయితే తారక్ ముందు దేవర 2 పూర్తి చేయాలి. దీనికన్నా ముందు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) ఉంది. ఎంతలేదన్నా రెండేళ్ల దాకా నిర్మాణానికి పట్టొచ్చు. వార్ 2 కాకుండా యష్ రాజ్ ఫిలింస్ కి తారక్ మరో సింగల్ కమిట్ మెంట్ ఇచ్చాడు. స్టోరీ ఫైనల్ కాలేదు.
ఇవన్నీ జరగడానికి ఎంతలేదన్నా 2026 వచ్చేస్తుంది. మరి శౌర్యువ్ ప్రాజెక్టు ఓకే అనుకుంటే ఎప్పుడు మొదలు పెడతారనేది పెద్ద ప్రశ్న. ఈ రెండు భాగాల సినిమాలు ఇక చాలని అభిమానులు కోరుకుంటున్నారు. వీటి వల్ల ఏళ్లకేళ్లు గడిచిపోయి తమ హీరోని తక్కువ చిత్రాల్లో చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగల్ పార్ట్స్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ కథలో ఉన్న స్పాన్, బిజినెస్ పరంగా ఉన్న సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దర్శకులు సీక్వెల్ ప్రతిపాదనతోనే వస్తున్నారు. దేవర ప్రెస్ మీట్ లో తారక్ దొరికే వరకు ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకదు.
This post was last modified on July 31, 2024 3:14 pm
గేమ్ ఛేంజర్ కు తెలుగులో డాకు మహారాజ్- సంక్రాంతికి వస్తున్నాం, తమిళంలో విడాముయార్చి పోటీ గురించే చూస్తున్నాం కానీ హిందీలోనూ…
సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన దేవర జపాన్ విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే ఏడాది మార్చి…
బడ్జెట్ పరంగా పండగ సినిమాల్లో గేమ్ ఛేంజర్ పెద్దది కాగా సంక్రాంతికి వస్తున్నాం చిన్నది. స్టార్ స్టేటస్ పక్కనపెడితే ఇది…
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…