చిన్న సినిమాల్లో వైవిధ్యం ఉంటే ఆదరణ ఉంటుందని ప్రేక్షకులు ఎప్పటికప్పుడు ఋజువు చేస్తూనే ఉన్నారు. కంటెంట్ బలంగా ఉంటే క్యాస్టింగ్ పెద్ద విషయమే కాదు. ఈ సూత్రాన్నే నమ్ముకుని వస్తున్న సినిమా సంతాన ప్రాప్తిరస్తు. మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి సంయుక్తంగా మధురా ఎంటర్ టైన్మెంట్స్, నిర్వి ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన ఈ మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఫస్ట్ లుక్ అధికారికంగా విడుదలయ్యింది. ఏబీసీడి లాంటి వినోదాత్మక చిత్రాన్ని అందించిన సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించగా టైటిల్ నుంచే ఆసక్తికరంగా కనిపిస్తోంది.
విక్రాంత్, చాందిని చౌదరి జంటగా ఇటీవలే సంతాన ప్రాప్తిరస్తు రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది. తాజాగా వదిలిన పోస్టర్ లో హీరో చేతిలో ఉన్న వస్తువులు, చుట్టూ ఉన్న ఐటమ్స్ ఏదో వీర్యకణాలను లెక్కబెట్టే టైపులో వినూత్నంగా అనిపిస్తున్నాయి. డిఫరెంట్ పాయింట్ తో కొత్తగా ఏదో చెప్పాలనే ప్రయత్నం చేశారు. మధ్యతరగతికి చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా విక్రాంత్ పాత్ర ఇందులో వైవిధ్యంగా ఉండబోతోంది. ఎక్కువ డీటెయిల్స్ రివీల్ చేయకపోయినా కంటెంట్ మీద నమ్మకం కలిగేలా మేకర్స్ తీసుకున్న జాగ్రత్త స్పష్టంగా ఉంది.
దీనికి స్క్రీన్ ప్లే షేక్ దావూద్ సమకూర్చారు. వేంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి సూపర్ హిట్స్ పని చేసిన అనుభవంతో సంతాన ప్రాప్తిరస్తుకి తన కలం ఇచ్చారు. సంగీతానికి అధిక ప్రాధాన్యం ఉన్న ఈ వినోదాత్మక చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి తగిన ప్రాధాన్యం ఉండనుంది. వెన్నెల కిషోర్, అభినవ్ గోమఠం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి తదితరులు ఇతర తారాగణం. విడుదల తేదీ ఇంకా ఖరారు కానీ సంతాన ప్రాప్తిరస్తు కంప్లీట్ ఫ్యామిలీ మూవీగా తీర్చిదిద్దుతున్నారు.
This post was last modified on July 30, 2024 10:23 pm
టాలీవుడ్ లో వరస అవకాశాలు వస్తున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి టాప్ త్రీలో ఉంది. హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే కాల్…
జగన్ హయాంలో అనేక తప్పులు జరిగాయని సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే.. మరీ ముఖ్యంగా కొన్ని తప్పుల కారణంగా.. రాష్ట్రం…
సూర్య ప్యాన్ ఇండియా మూవీ కంగువాకు బాక్సాఫీస్ వద్ద వస్తున్న స్పందన చూసి అభిమానులు సంతోషంగా లేరన్నది ఓపెన్ సీక్రెట్.…
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో…
వైసీపీ హయాంలో పవిత్రమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న తమను పాఠశాలల్లో మరుగుదొడ్ల పర్యవేక్షణకు, మద్యం షాపుల దగ్గర విధులకు…
వైసీపీ హయాంలో అనుకున్న దానికన్నా రాష్ట్రంలో విధ్వంసం ఎక్కువగానే జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో…