Movie News

తమిళ ఇండస్ట్రీలో అగ్గి రాజుకుంది

తమిళ నిర్మాతల మండలి తాజాగా తీసుకున్న నిర్ణయాల మీద ఆ ఇండస్ట్రీలోనే కాదు.. తెలుగు సినీ పరిశ్రమలో కూడా చర్చ జరుగుతోంది. నిర్మాతల దగ్గర భారీ స్థాయిలో అడ్వాన్సులు తీసుకుని.. ఆ చిత్రాలను ముందుకు తీసుకెళ్లకుండా వేరే ప్రాజెక్టులు కమిటవడం.. కొందరు నిర్మాతలకు ఎంతకీ సినిమాలు చేయకపోవడం లాంటి చర్యలను ఖండిస్తూ కొన్ని సంచలన తీర్మానాలు చేసింది కోలీవుడ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలు పూర్తి చేయడానికి డెడ్ లైన్ పెట్టడమే కాక.. కొత్త చిత్రాలు మొదలుపెట్టడానికి వీల్లేదని కూడా తేల్చేశారు.

ప్రధానంగా ధనుష్ మీద ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గుర్రుగా ఉంది. తనతో సినిమాలు చేయాలనుకునే నిర్మాతలు ముందు తమను సంప్రదించాలని స్పష్టం చేసింది. మరోవైపు హీరో విశాల్ వ్యవహార శైలి మీద కూడా నిర్మాతల మండలి ఆగ్రహంతో ఉంది. కొంత కాలంగా కౌన్సిల్‌కు, విశాల్‌కు మధ్య గొడవ నడుస్తున్న సంగతి తెలిసిందే.

ధనుష్‌తో పాటు విశాల్ మీద నిషేధం విధించే ఆలోచన కూడా నిర్మాతల మండలి చేసిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాల్ కార్యదర్శిగా, నాజర్ అధ్యక్షుడిగా ఉన్న నడిగర్ సంఘం రంగంలోకి దిగింది. అత్యవసర సమావేశం నిర్వహించిన నడిగర్ సంఘం.. నిర్మాతల మండలి నిర్ణయాల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. నటులతో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవడానికి చూడాలి కానీ.. ఏకపక్షంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారు, షూటింగ్‌లు ఎలా ఆపేస్తారు, ఫలానా టైంలోపు సినిమాలు పూర్తి చేయాలని ఎలా కండిషన్లు పెడతారు అని నడిగర్ సంఘం ప్రశ్నిస్తోంది.

ఈ విషయంలో నిర్మాతల మండలి మీద పోరడడానికి నడిగర్ సంఘం రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ గొడవ ఎక్కడిదాాకా వెళ్తుందో అన్న చర్చ కోలీవుడ్లో నడుస్తోంది. ఇండస్ట్రీ పెద్దలు జోక్యం చేసుకుని నిర్మాతలు, నటుల మధ్య సయోధ్య కుదర్చకుంటే సమస్య జఠిలమయ్యేలా ఉంది.

This post was last modified on July 30, 2024 1:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

17 minutes ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

55 minutes ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

1 hour ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

2 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

3 hours ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

5 hours ago