Movie News

రేసుకు తెర‌లేపిన రాజా సాబ్‌

క్రేజీ సీజన్ల కోసం చాలా ముందుగానే బెర్తులు బుక్ చేసి పెట్టుకోవ‌డం ఇప్పుడు ట్రెండ్. సంక్రాంతి కోసం క‌నీసం ఆరు నెల‌ల ముందు డేట్లు లాక్ అయిపోతుంటాయి. త‌ర్వాత మార్పులు చేర్పులు ఉంటే ఉంటాయి కానీ… ముందు అయితే క‌ర్చీఫ్ వేసేద్దామ‌ని చూస్తుంటారు. వేస‌వి విష‌యంలోనూ అంతే. చాలా ముందుగానే బెర్తులు బుక్ చేస్తుంటారు. 2025 వేస‌వికి కొన్ని హిందీ చిత్రాల మేక‌ర్స్ అయితే డేట్లు ఇచ్చారు కానీ.. తెలుగు నుంచి మాత్రం ఇప్ప‌టిదాకా ఏ సినిమా ఆ సీజ‌న్లో రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌లేదు. కాగా ఇప్పుడు తొలి అడుగు రెబ‌ల్ స్టార్ ప్ర‌భాసే వేశాడు.

రాజా సాబ్ విడుద‌లపై ఉత్కంఠ‌కు తెర‌దించుతూ చిన్న గ్లింప్స్‌తో రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చేశారు. 2025 వేస‌వి ఆరంభంలో.. అంటే ఏప్రిల్ 10న ఈ చిత్రం థియేట‌ర్ల‌లోకి దిగ‌బోతోంది. అంటే క‌ల్కి వ‌చ్చిన ప‌ది నెల‌ల‌కే ఇంకో సినిమాతో ప్ర‌భాస్ రాబోతున్నాడ‌న్న‌మాట‌.

ప్ర‌భాస్ సినిమా అంటే పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాష‌ల్లో రిలీజ‌వ‌తుఉంద‌న్న సంగ‌తి తెలిసిందే. రాజాసాబ్ విష‌యంలోనూ అదే జ‌ర‌గ‌బోతోంది. కాబ‌ట్టి ఇత‌ర భాష‌ల్లో వ‌చ్చే వేస‌వికి రాబోయే చిత్రాలు కూడా దీన్ని బ‌ట్టే రిలీజ్ డేట్లు చూసుకోవాలి. మొత్తానికి 2025 స‌మ్మ‌ర్ రేసును ప్ర‌భాస్ మొద‌లుపెట్టేశాడు.

ఇక ఆ సీజ‌న్లోకి మిగ‌తా రేసు గుర్రాలు రావాల్సి ఉంది. క్రిస్మ‌స్‌కు అనుకున్న తండేల్ మూవీని అక్క‌డ్నుంచి త‌ప్పిస్తార‌ని అంటున్నారు. కుదిరితే సంక్రాంతికి వేస్తారు. లేదంటే వేస‌వికి తీసుకెళ్లాల్సిందే. గేమ్ చేంజ‌ర్ డిసెంబ‌రులో మిస్స‌యినా వేస‌వి రిలీజే ఉండొచ్చు. ధనుష్‌-నాగార్జున‌ల కుబేర మూవీ కూడా వేస‌విలో వ‌చ్చే అవ‌కాశ‌ముంది. కేజీఎఫ్ ఫేమ్ య‌శ్ కొత్త చిత్రం టాక్సిక్‌ను కూడా ఆ టైంలోనే రిలీజ్ చేసే అవ‌కాశ‌ముంది. హిందీ నుంచి స‌ల్మాన్ మూవీ సికంద‌ర్‌తో పాటు జాలీ ఎలెల్బీ-3 లాంటి కొన్ని క్రేజీ చిత్రాలు 2025 స‌మ్మ‌ర్‌ను టార్గెట్ చేశాయి. త్వ‌ర‌లో వివిధ భాష‌ల నుంచి మ‌రి కొన్ని చిత్రాల వేస‌వి రిలీజ్ మీద క్లారిటీ రావ‌చ్చు.

This post was last modified on July 30, 2024 7:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

26 minutes ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

2 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

2 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

3 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

4 hours ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

5 hours ago