Movie News

దీపిక ఆ వాట్సాప్ చాట్‌ను డెలీట్ చేసినా సరే..

బాలీవుడ్‌ను కుదిపేస్తోంది డ్రగ్స్ కేసు. దీని ఉచ్చులో ప్రముఖ తారలు చిక్కుకున్నారు. అందులో దీపికా పదుకొనే కూడా ఒకరు. ఈ స్టార్ హీరోయిన్‌కు డ్రగ్స్ అలవాటుందని.. తన మేనేజర్ ద్వారా వాటిని తెప్పించుకునేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వెల్లడించడం.. దీపికను విచారణకు కూడా పిలవడం, శనివారం ఆమె విచారణకు హాజరవుతుండటం తెలిసిన సంగతే.

దీపిక, ఆమె మేనేజర్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ ఆధారంగా ఆమె డ్రగ్స్ వాడేదని తెలిసిందని ఎన్సీబీ అధికారులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఐతే వాళ్లిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ ఎన్సీబీ అధికారులకు ఎలా చేరిందన్నది ప్రశ్న. ఇదే కాదు.. బాలీవుడ్లో పలువురు తారలు డ్రగ్స్‌కు సంబంధించి చేసిన వాట్సాప్ సంభాషణల్ని ఎన్సీబీ అధికారులు యాక్సెస్ చేశారట. నిజానికి ఆ చాట్స్ అన్నీ కూడా ఎప్పుడో చేసినవని, పైగా డెలీట్ అయిపోయినవి.

అయినా సరే.. అధికారులు వాటిని రిట్రీవ్ చేయడం విశేషం. ఇదంతా అధునాతన సాంకేతికత ద్వారా సాధ్యమైంది. మనం వాట్సాప్‌లో డెలీట్ చేసిన సంభాషణల్ని కూడా చాలా రోజుల తర్వాత బయటికి తీయగల టెక్నాలజీ అందుబాటులో ఉంది. ప్రభుత్వ సంస్థలు అనుకుంటే ఆ పని చేయగలవు. ప్రస్తుతం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు వాట్సాప్ సర్వర్ల ద్వారా ఈ డెలీటెడ్ చాట్స్‌ను వెలికి తీసినట్లు సమాచారం. అలాగే మొబైళ్లలో చాట్స్ డెలీట్ అయినప్పటికీ గూగుల్ డ్రైవ్, క్లౌడ్ లాంటి వాటిలో ఉన్న బ్యాకప్‌ను రిట్రీవ్ చేయడం ద్వారా కూడా సమాచారాన్ని వెలికి తీశారట.

డ్రగ్స్ రాకెట్ బయటపడి.. విచారణ సాగుతున్న నేపథ్యంలో చాలామంది బాలీవుడ్ తారలు ఇలాగే పాత చాట్‌లను డెలీట్ చేసేస్తుండగా.. వాటిని రిట్రీవ్ చేయడానికి పక్కాగా ప్లాన్ చేసి రంగంలోకి దిగిన అధికారులు.. వాళ్లకు షాకిస్తున్నారు. కాబట్టి వాట్సాప్ వాడేవాళ్లందరూ కూడా ఈ పరిణామాలు చూసి జాగ్రత్త పడాల్సిందే. వాట్సాప్ చాట్‌లు డెలీట్ చేసేశాం అనుకుంటే చేసిన తప్పులు తర్వాత అయినా బయటపడొచ్చు. కాబట్టి జాగ్రత్త.

This post was last modified on September 25, 2020 4:03 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

శింగ‌న‌మ‌ల సింగ‌మ‌లై ఎవ‌రో?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్నా కొద్దీ పార్టీల‌న్నీ ప్ర‌చారంలో దూసుకెళ్తున్నాయి. అభ్య‌ర్థులు…

30 mins ago

తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో వాస్తు మార్పులు?

హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల యుద్ధం మరో వారం రోజుల్లో ఒక కొలిక్కి రావటంతో పాటు.. ఎన్నికల్లో కీలక అంకమైన…

2 hours ago

చిన్న దర్శకుడి మీద పెద్ద బాధ్యత

మాములుగా ఒక చిన్న సినిమా దర్శకుడు డీసెంట్ సక్సెస్ సాధించినప్పుడు అతనికి వెంటనే పెద్ద ఆఫర్లు రావడం అరుదు. రాజావారు…

2 hours ago

తీన్మార్ మ‌ల్ల‌న్న ఆస్తులు ప్ర‌భుత్వానికి.. సంచ‌ల‌న నిర్ణ‌యం

తీన్మార్ మ‌ల్ల‌న్న‌. నిత్యం మీడియాలో ఉంటూ..త‌న‌దైన శైలిలో గ‌త కేసీఆర్ స‌ర్కారును ఉక్కిరిబిక్కిరికి గురి చేసిన చింత‌పండు న‌వీన్ గురించి…

3 hours ago

ఆవేశం తెలుగు ఆశలు ఆవిరయ్యాయా

ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన మలయాళం సినిమా ఆవేశం తెలుగులో డబ్బింగ్ లేదా రీమేక్ రూపంలో చూడాలని ఫ్యాన్స్…

3 hours ago

అమిత్ షా మౌనంపై ఆశ్చర్యం !

తెలంగాణలో ఈసారి 17 ఎంపీ స్థానాలకు 12 స్థానాలలో గెలుపు ఖాయం అని బీజేపీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది.…

4 hours ago