కల్కి 2898 ఏడి బ్లాక్ బస్టర్ విజయాన్ని ఇంకా ఆస్వాదిస్తూ ఉండగానే ప్రభాస్ కొత్త సినిమా ది రాజా సాబ్ ప్రమోషన్లు మొదలైపోయాయి. నిజానికి విడుదల తేదీ ఇంకా దూరంలో ఉంది కాబట్టి పబ్లిసిటీ ఇప్పుడప్పుడే ఉండదని ఫ్యాన్స్ భావించారు. కానీ వాళ్ళ అంచనాలకు భిన్నంగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ముందస్తు కానుకలతో సిద్ధమయ్యింది. కాన్సెప్ట్ చెప్పే టీజర్ కాకపోయినా దర్శకుడు మారుతీ ఊరించిన ప్రకారం డార్లింగ్ నాటి వింటేజ్ లుక్స్ ఇందులో ఉంటాయని ముందు నుంచి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ చిన్న వీడియో మీదే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.
కథని రివీల్ చేయలేదు. ఫ్యాన్ ఇండియా టీజర్ అన్నారు కాబట్టి కేవలం ప్రభాస్ దర్శనం మాత్రమే జరిగింది. రాయల్ సూట్ వేసుకుని ఖరీదైన వాహనం నుంచి దిగి పువ్వులు పట్టుకుని సైడ్ మిర్రర్ లో తనను తాను చూసుకుని డార్లింగ్ ఇచ్చే నవ్వుకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అనే రేంజ్ లో కట్ చేశారు. బ్యాక్ డ్రాప్, ఇతర ఆర్టిస్టులు ఎవరూ లేకుండా కేవలం తమన్ నేపధ్య సంగీతంతో ఒక ఫీల్ గుడ్ భావన కలిగేలా చూసుకున్నారు. టీజర్ టైటిల్ కు తగ్గట్టు ముఖ్యంగా అభిమానుల కోసమే చేయించిన ఈ వీడియో వాళ్లకు మాత్రం మళ్ళీ మళ్ళీ చూసుకునేలా ఉంది.
చాలా కాలం తర్వాత యాక్షన్ మోడ్ నుంచి బయటికి వచ్చిన ప్రభాస్ లుక్స్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. అందంగా, హుందాగా అన్నింటి మించి ట్రూ బ్యాచిలర్ అనిపించేలా కాస్ట్యూమ్స్ ని డిజైన్ చేసిన తీరు వాహ్ అనిపించేలా ఉంది. సర్ప్రైజ్ ఏంటంటే విడుదల తేదీ 2025 ఏప్రిల్ 10 అని అధికారికంగా ప్రకటించారు. సో రిలీజ్ డేట్ గురించి ఉన్న అనుమానాలు అన్నీ తీరిపోయాయి. కల్కి వచ్చిన 10 నెలల తర్వాత మళ్ళీ థియేటర్లలో ప్రభాస్ ని చూసుకోవచ్చన్న మాట. హారర్ కామెడీ రొమాంటిక్ ఎంటర్ టైనర్ అని చెప్పేశారు కాబట్టి ఏ జానర్ అనే సందేహాలకు పూర్తిగా చెక్ పడిపోయింది.
This post was last modified on July 29, 2024 6:55 pm
ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…
థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…
కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…
యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…