Movie News

కంగువ ముగింపులో కాష్మోరా ప్రవేశం

ఇంకా రెండు నెలలకు పైగానే సమయమున్నప్పటికీ కంగువ మీద అంచనాలు అప్పుడే ఓ రేంజ్ లో ఉన్నాయి. రెండేళ్లకు పైగా గ్యాప్ తో సూర్య నటించిన ప్యాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని భాషల్లోనూ డిమాండ్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బిజినెస్ ని నిర్మాత జ్ఞానవేల్ రాజా భారీ ఎత్తున ఆశిస్తున్నారు. అక్టోబర్ 10 దసరా కానుకగా రిలీజవుతున్న ఈ విజువల్ గ్రాండియర్ లో దిశా పటాని హీరోయిన్ గా, బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సూర్య రెండు కాలాలకు సంబంధించిన వీరుడిగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు.

కంగువలో చాలా సర్ప్రైజులు ఉంటాయట. ముఖ్యంగా అన్నదమ్ములు సూర్య, కార్తీ ఒకే ఫ్రేమ్ లో కనిపించే ఎపిసోడ్ ఓ రేంజ్ లో పేలిందని చెన్నై టాక్. క్లైమాక్స్ చివరి ఘట్టంలో కార్తీ ఎంట్రీ ఉంటుందని, పార్ట్ 2కి లీక్ ఇచ్చే ముఖ్యమైన ట్విస్టు తన చుట్టే అల్లారని తెలిసింది. అంటే కాష్మోరాగా వస్తాడా లేక ఖైదీ ఢిల్లీగా కనిపిస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఒకవేళ సూర్య కూడా రోలెక్స్ గా కనిపించినా ఆశ్చర్యం లేదు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ కాబట్టి సినిమాటిక్ లిబర్టీని ఎంతైనా వాడుకోవచ్చు. దర్శకుడు సిరుతై శివ చాలా ప్రత్యేకంగా ఈ ఇద్దరి పాత్రలను డిజైన్ చేసినట్టు ఇన్ సైడ్ న్యూస్.

సో ముఖ్యమైన లీకు బయటికి వచ్చేసింది కాబట్టి హైప్ మరింత పెరగడం ఖాయం. నెల రోజులు పూర్తిగా ప్రమోషన్ల కోసమే కేటాయించబోతున్న కంగువ టీమ్ దీన్ని బాహుబలి, ఆర్ఆర్ఆర్ రేంజ్ లో పబ్లిసిటీ చేయాలని చూస్తున్నారు. కేరళ, కర్ణాటకలో ఉదయం నాలుగు గంటల నుంచే షోలు వేసేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఫైర్ సాంగ్ ఇటీవలే విడుదలై మంచి స్పందన దక్కించుకుంది. ఐమాక్స్, త్రీడి, ఫోర్డిఎక్స్ తదితర వెర్షన్లలో వస్తున్న కంగువకు రెండో భాగం 2026 లేదా ఆపై ఏడాది విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

This post was last modified on July 29, 2024 2:31 pm

Share

Recent Posts

మండాడి మెరుపు దాడి ఎవరు ఊహించారు

త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…

22 minutes ago

త్రినాథుడి బ్యాటింగ్ ఆపే టైమొచ్చింది

పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…

52 minutes ago

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

2 hours ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

2 hours ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

3 hours ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

3 hours ago