2024లో విశ్వక్ సేన్ మంచి స్వింగ్ లో ఉన్నాడు. ఏడాది పూర్తవ్వకుండానే ఏకంగా మూడు రిలీజులు వచ్చేలా చూసుకున్నాడు. హిట్టు ఫ్లాపు సంగతి పక్కనపెడితే వీలైనంత ఎక్కువ సినిమాలు యూత్ హీరోలు చేయాల్సిన పరిస్థితుల్లో ఇలా దూకుడు చూపించడం అవసరమే. గామి కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలు పొంది, ఆడియన్స్ మెప్పుతో నిర్మాతలలకు సేఫ్ ప్రాజెక్టుగా నిలిచింది. ఊర మాస్ మేకోవర్ అందుకుందామని చూసిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి నిరాశపరిచినప్పటికీ విశ్వక్ పెర్ఫార్మన్స్ పరంగా కంప్లయింట్ రాలేదు. ఇప్పుడు అక్టోబర్ లో మెకానిక్ రాకీగా రాబోతున్నాడు.
ఇవాళ టీజర్ లాంచ్ జరిగింది. నిజానికి రిలీజ్ డేట్ ఇంకా దూరం ఉన్నప్పటికీ టీమ్ మూడు నెలల ముందు నుంచే ప్రమోషన్లు మొదలుపెట్టడం చూస్తుంటే కంటెంట్ ఏదో బలంగా ఉన్నట్టు తోస్తోంది. కథను పూర్తిగా రివీల్ చేయకపోయినా కొన్ని క్లూస్ అయితే ఇచ్చారు. మెకానిక్ షెడ్డుతో జీవితం గడుపుతున్న రాకీ జీవితంలోకి ఇద్దరమ్మాయిలు రావడం, సునీల్ లాంటి విలన్ ఎంట్రీ, మాఫియా ప్రవేశం, ఊహించని పరిణామాలు ఇలా సెటప్ మొత్తం డిఫరెంట్ గానే అనిపిస్తోంది. హోమ్లీగా నటించే శ్రద్ధ శ్రీనాథ్ ని కొత్త అవతారంలో చూపించడం లాంటి ప్రయోగాలు చాలానే చేశారు.
తన కెరీర్లోనే మెకానిక్ రాకీ బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ అవుతుందని విశ్వక్ సేన్ పదే పదే చెప్పడం చూస్తుంటే సంగీత దర్శకుడు జేక్స్ బెజోయ్ పనితనం ఓ రేంజ్ లో వచ్చినట్టు ఉంది. అక్టోబర్ 31 థియేటర్లలో అడుగు పెట్టబోతున్న మెకానిక్ రాకీలో ఊహించని కొన్ని ఎలిమెంట్స్ థ్రిల్ ఇస్తాయని ఇన్ సైడ్ టాక్. దర్శకుడు రవితేజ ముళ్ళపూడి టెక్నికల్ గా బాగా తెరకెక్కించారని అంటున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో నరేష్, సునీల్, హర్షవర్ధన్, హర్ష చెముడు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతానికి పోటీ లేని మంచి డేట్ మెకానిక్ రాకీకి దొరికింది.
This post was last modified on July 28, 2024 6:00 pm
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఆరు మాసాలు కూడా కాలేదు. కేవలం ఐదు మాసాలు మాత్రమే పూర్తయింది. కానీ,…
వంశీ పైడిపల్లికి యావరేజ్ డైరెక్టర్ అని పేరుంది. అతను గొప్ప సినిమాలేమీ తీయలేదు. కానీ.. అతను కెరీర్లో ఇప్పటిదాకా పెద్ద…
ఇంకో ఇరవై రోజుల్లో విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ మీద అంచనాలు కొలవాలంటే తలలు పండిన ట్రేడ్…
జనం డబ్బుతో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్, షర్మిల, విజయమ్మ, సునీతలను జగన్ బూతులు తిట్టించారా? అంటే అవును అని…
అగ్ర రచయిత పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తుతం సినిమాలకు రచన చేయకపోయినా కొత్త రిలీజులు చూస్తూ వాటి తాలూకు లోటుపాట్లు, ప్లస్…
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున 11 మంది ఎమ్మెల్యేలు విజయం దక్కించుకున్నారు. వీరిలో జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…