టాలీవుడ్లో ఇండస్ట్రీ జనాలే కాక ప్రేక్షకులు కూడా ఎంతో ఇష్టపడే హీరోల్లో అల్లరి నరేష్ ఒకడు. ఒకప్పుడు అతను కామెడీ సినిమాలతో అంతగా నవ్వించాడు మరి. అంతే కాక తన ప్రవర్తన కూడా చాలా హుందాగా ఉంటుంది. వివాదాలకు పూర్తి దూరంగా ఉంటాడు. అందుకే అతను అందరికీ ఇష్టుడు.
అల్లరోడు సరైన హిట్ లేక ఇబ్బంది పడుతుంటే అందరూ బాధపడ్డవాళ్లే. తనకు ‘నాంది’ సినిమాతో మళ్లీ ఓ మంచి సక్సెస్ వస్తే అందరూ అంత సంతోషించారు కూడా. కానీ ఆ సక్సెస్‌ను అతను నిలబెట్టుకోలేకపోయాడు. ఉగ్రం, మారేడుమిల్లి నియోజకవర్గం, ఆ ఒక్కటీ అడక్కు.. ఇలా చివరి మూడు చిత్రాలూ నిరాశపరిచాయి. ఇప్పుడు తన ఆశలన్నీ ‘బచ్చల మల్లి’ మీదే ఉన్నాయి. ఈ సినిమా ప్రోమోలు బాగానే ఉన్నాయి.
ఐతే ‘బచ్చల మల్లి’ కంటే కూడా నరేష్ చేయబోయే కొత్త సినిమా ఇంకా ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. ఆ చిత్రం శనివారమే ప్రారంభోత్సవం జరుపుకుంది. ‘ఫ్యామిలీ డ్రామా’ అనే వెరైటీ థ్రిల్లర్ మూవీ తీసి మెప్పించిన మెహర్ తేజ్ అనే యువ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది.
నరేష్ వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు కానీ.. పెద్ద బేనర్లలో తనకు ఛాన్సులు రావట్లేదు. సితార లాంటి బేనర్లకు ఉన్న గుడ్ విల్ వల్ల సినిమాలకు రీచ్ ఎక్కువ ఉంటుంది. ప్రమోషన్లు కూడా గట్టిగా చేస్తారు. ‘ఫ్యామిలీ డ్రామ’ తీసిన దర్శకుడంటే నరేష్ నుంచి ఒక వెరైటీ సినిమాను కూడా ఆశించవచ్చు. కాబట్టి ఈ చిత్రంతో అల్లరోడి దశ తిరుగుతుందని ఆశించవచ్చు. ఈ చిత్రంలో రుహాని శర్మ కథానాయికగా నటించనుంది.
This post was last modified on July 27, 2024 6:46 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…