Movie News

మైత్రి దూకుడు మాములుగా లేదు

శ్రీమంతుడు లాంటి పెద్ద సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ ఆ తర్వాత టాప్ ప్రొడక్షన్ హౌస్ గా ఎదిగిన వైనం చూస్తూనే ఉన్నాం. మధ్యలో అందరిలాగే ఫ్లాపులు డిజాస్టర్లు చూస్తున్నప్పటికీ క్రమం తప్పకుండా బ్లాక్ బస్టర్లు పడుతూనే ఉన్నాయి. పుష్ప 2, ఫౌజీ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ నిర్మాణంతో పాటు ఇంకోవైపు డిస్ట్రిబ్యూషన్ ని పటిష్ట పరుచుకునే క్రమంలో మైత్రి ఏ అవకాశాన్ని విడిచి పెట్టడం లేదు. ముఖ్యంగా నైజాంలో బలమైన పట్టున్న దిల్ రాజు, ఏషియన్, సురేష్ సంస్థలకు ధీటుగా పంపిణి వ్యవస్థతో పాటు థియేటర్ రంగంలోనూ విస్తరణను చేపట్టింది.

ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న పెద్ద సినిమాలు మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ మూడింటి తెలంగాణ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకోవడం ద్వారా తన ఉద్దేశమేంటో మైత్రి స్పష్టంగా చెబుతున్నట్టు అయ్యింది. ఎంత మొత్తమనే వివరాలు పూర్తిగా బయటికి రాకపోయినా చాలా క్రేజీ ఆఫర్స్ తో క్లోజ్ చేశారని సమాచారం. గత ఏడాది సంక్రాంతికి తమ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు థియేటర్ల విషయంలో ఇబ్బంది పడ్డ మైత్రి మళ్ళీ అలాంటి పరిస్థితి ఎదురు కాకుండా పక్కా ప్రణాళికతో మూతబడిన సింగల్ స్క్రీన్లను లీజుకు తీసుకుని రినోవేట్ చేయించి నడుపుతున్నారు.

రాబోయే రోజుల్లో వీటిని మరింతగా విస్తరించే పనిలో ఉన్నారు మైత్రి మేకర్స్. ఎగ్జిబిషన్ రంగం కుదుపులకు లోనవుతున్నప్పటికీ ఇంత రిస్క్ చేసి పెట్టుబడులు పెట్టడమంటే మాములు విషయం కాదు. అందులోనూ వందల కోట్లు ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు ఇలా విడిగా డిస్ట్రిబ్యూషన్ కు డబ్బులు ఖర్చు చేయడం రిస్క్ తో కూడుకున్న పని. గత రెండేళ్లలో విడుదలకు కష్టపడ్డ ఎన్నో చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు పంపిణి పరంగా మైత్రి అండదండలు అందించింది. హనుమాన్ సైతం నైజాంలో బాలారిష్టాలు పడితే గట్టెక్కించారు. రికార్డు వసూళ్లు రాబట్టుకున్నారు. ఆగస్ట్ 15 వీళ్లకు బిగ్ డే కానుంది.

This post was last modified on July 27, 2024 12:27 pm

Share

Recent Posts

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

23 minutes ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

1 hour ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

3 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

3 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

5 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

5 hours ago