టాలీవుడ్ యువ కథానాయకుడు రామ్ ఇప్పటిదాకా ప్రాపర్ పాన్ ఇండియా మూవీ ఏదీ చేయలేదు. కానీ అతడికి ఉత్తరాదిన ఫాలోయింగ్ మామూలుగా లేదు. రామ్ అంటే ఊగిపోయే ఫ్యాన్స్ ఉన్నారు నార్త్ ఇండియాలో. ఇదంతా యూట్యూబ్‌లో అతడి డబ్బింగ్ సినిమాల మహిమ. జియో రాకతో ఇంటర్నెట్ చౌకగా మారాక నార్త్ ఇండియన్ ఆడియన్స్ యూట్యూబ్‌లో మన మాస్ సినిమాలను తెగ చూస్తన్న సంగతి తెలిసిందే. దీంతో తెలుగులో పెద్ద పెద్ద డిజాస్టర్ మూవీస్‌కు కూడా హిందీలో కోట్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. రామ్ సినిమాలు కూడా చాలానే అలా ఆదరణ పొందాయి.
తాజాగా రామ్ మూవీ స్కంద హిందీ వెర్షన్ కూడా యూట్యూబ్‌లో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకోవడం విశేషం. ఈ చిత్రానికి 100 మిలియన్.. అంటే పది కోట్ల వ్యూస్ రావడం విశేషం. అంతే కాక ఈ చిత్రం 11 లక్షల లైక్స్ కూడా సంపాదించింది.
గత ఏడాది విడుదలైన స్కంద మూవీ తెలుగులో పెద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. బోయపాటి, రామ్ కాంబినేషన్ గురించి జనాలు ఎంతో ఊహించుకున్నారు కానీ..లాజిక్ లేకుండా సిల్లీగా సాగిన మాస్ మూవీని ప్రేక్షకులు ఏమాత్రం ఆదరించలేదు. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రోల్ మెటీరియల్‌గా మారింది. ఐతే ఇలాంటి పేలవమైన సినిమాలు ఎన్నో హిందీలో డబ్ అయి కోట్లల్లో వ్యూస్ సంపాదించాయి.
ఇంకో విశేషం ఏంటంటే.. రామ్‌కు హిందీలో వరుసగా పదో పది కోట్ల వ్యూస్ సినిమా కావడం విశేషం. దీని కంటే ముందు అతడి సినిమాలు తొమ్మిది హిందీలో అనువాదమై యూట్యూబ్‌లో పదికోట్లు, అంతకంటే ఎక్కువ వ్యూస్ సాధించాయి. ఇలాగే మరో యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలకు కూడా హిందీలో మంచి ఫాలోయిగ్ ఉంది. అతడి సినిమాలు కూడా చాలానే రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించాయి.
This post was last modified on July 27, 2024 10:46 am
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…