Movie News

బిగ్‍బాస్‍ పోల్స్ లో ఆమెకి సడన్‍ ఫాలోయింగ్‍

బిగ్‍బాస్‍ రియాలిటీ షోలో పాల్గొనే వాళ్లు ముందుగా గుర్తు పెట్టుకోవాల్సినది… ఏ హౌస్‍మేట్‍ని తక్కువ చేయకూడదని. బయట ఎవరు ఎంత గొప్పవాళ్లయినా కావచ్చు కానీ హౌస్‍లోకి వెళ్లిన తర్వాత అందరూ సమానమే. అందుకే బిగ్‍బాస్‍ హౌస్‍లో ఎవరికీ ప్రత్యేక మర్యాదలుండవు.

అందరూ వంట చేయాలి, అందరూ బాత్రూమ్‍లు కడగాలి, అందరికీ ఒకే తరహా మంచాలు, కంచాలుంటాయి. అయితే వివిధ బ్యాక్‍గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్లను, లేదా అంతగా పాపులర్‍ కాని వాళ్లను కాస్త పేరున్న వాళ్లు అణచి వేయాలని చూస్తుంటారు. తమకు ఫాన్స్ వున్నారు కనుక తమ స్థానానికి ఎలాంటి సమస్య వుండదని అనేసుకుంటారు.

కానీ అంతిమంగా విజేతలవ్వాలంటే మాత్రం షో ద్వారా ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుని తీరాలి. అందుకే కౌషల్‍ అయినా, రాహుల్‍ అయినా విజేతలయ్యారు. ఈ సీజన్లో హౌస్‍మేట్స్ అస్సలు లెక్క చేయని ఇద్దరు కంటెస్టెంట్లు కుమార్‍ సాయి, అరియానా గ్లోరీ. కమెడియన్‍ కుమార్‍ సాయి అయినా నిజంగానే బద్ధకంగా వుంటున్నాడు కానీ అరియానా మాత్రం తనవంతుగా పూర్తి ఎఫర్టస్ పెడుతోంది. అయితే ఆమెను అభిజీత్‍, హారిక, సోహైల్‍ లాంటి కొందరు చిన్నచూపు చూస్తున్నారు. ఆమె ఏమి మాట్లాడినా, ఆటలో ఎలాంటి సలహాలిచ్చినా తీసి పారేస్తున్నారు.

అయితే అరియానా దాని గురించి ఎక్కడా రచ్చ చేయడం లేదు. తన వాదన వినిపిస్తోందే కానీ తనను ఇల్‍ట్రీట్‍ చేస్తున్నారని డ్రామా కూడా చేయడం లేదు. ఇదంతా ప్రేక్షకులు గమనిస్తున్నారు కనుక ఆమెకు సడన్‍గా గ్రాఫ్‍ రైజ్‍ అయింది. ఈ వారం ఎలిమినేట్‍ అయిపోతుందేమో అనుకున్నారు కానీ ఆమెకు ఫాలోయింగ్‍ పెరిగింది. ప్రేక్షకుల నుంచి భారీగానే ఓట్లు పడుతున్నాయి. ఆమె పట్ల హౌస్‍మేట్స్ ప్రవర్తిస్తోన్న తీరుని నాగార్జున ప్రశ్నించినట్టయితే, వాళ్లు తమ తప్పుని గ్రహించినట్టయితే ఓకే కానీ లేదంటే అరియానా కూడా ప్రేక్షకుల సపోర్ట్ తో టైటిల్‍ కంటెండర్‍ అయిపోతుంది.

This post was last modified on September 25, 2020 3:43 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

బీఆర్ఎస్‌కూ కావాలొక వ్యూహ‌క‌ర్త‌

బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌నే క‌ల‌లు గ‌న్న…

1 hour ago

అద్దం పంపిస్తా.. ముఖం చూసుకో అన్న‌య్యా..

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొన్నాళ్లుగా వైసీపీ అధినేత‌, సొంత అన్న‌పై ఆమె తీవ్ర‌స్థాయిలో యుద్ధం…

3 hours ago

ఎన్టీఆర్ పుట్టిన రోజుకు సర్ప్రైజ్

పెద్ద హీరోల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు వస్తే అభిమానులు వాళ్లు నటిస్తున్న కొత్త చిత్రాల నుంచి అప్‌డేట్స్…

3 hours ago

ముద్రగడ సమాధి కట్టేసుకున్నారా?

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా పరంగా అగ్రస్థానంలో ఉండే కాపు కులస్థుల కోసం ఉద్యమించిన నాయకుడిగా వంగవీటి మోహనరంగా తర్వాత ఓ మోస్తరు…

3 hours ago

ఆ చట్టం జగన్‌ మెడకు చుట్టుకుందా?

ఎన్నికలు జరగబోతున్నపుడు అనుకోకుండా కొన్ని విషయాలు కీలకంగా మారి అధికార పక్షాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటాయి. అవి ఎన్నికల ఫలితాలనే…

4 hours ago

సరిపోని అల్లరితో నరేష్ ఇబ్బందులు

భారీ నమ్మకంతో రోజుల తరబడి ప్రమోషన్లు చేసిన ఆ ఒక్కటి అడక్కుకి మిక్స్డ్ టాక్ కొనసాగుతోంది. మాములుగా ఇలాంటి సినిమాలకు…

5 hours ago