ఆస్కార్ గ్రహీత, మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ మీద టాలీవుడ్ లో ఉన్న ఒకే ఒక్క అసంతృప్తి ఏంటంటే స్ట్రెయిట్ గా చేసిన తెలుగు సినిమాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇవ్వకపోవడం. కెరీర్ ప్రారంభంలో కేవలం బీజీఎమ్ ఇచ్చిన నిప్పురవ్వతో మొదలుపెట్టి అటుపై సూపర్ పోలీస్, గ్యాంగ్ మాస్టర్, కొమరం పులి వగైరాలన్నీ డిజాస్టర్లే. పల్నాటి పౌరుషం, ఏ మాయ చేసావే లాంటివి బాగానే ఆడినా వాటి ఒరిజినల్ వెర్షన్లు తమిళమన్న సంగతి మర్చిపోకూడదు. కెరీర్ దివ్యంగా ఉన్నప్పుడు రెహమాన్ డబ్బింగ్ రూపంలో ఎన్నో తిరుగులేని ఛార్ట్ బస్టర్స్ ఇచ్చారు. కానీ గత కొన్నేళ్లుగా ఆయన స్థాయి మేజిక్ వినిపించలేదు.
అందుకే రామ్ చరణ్ 16కి దర్శకుడు బుచ్చిబాబు రెహమాన్ ని ఎంచుకొన్నపుడు మెగా ఫ్యాన్స్ లో సందేహాలు రాకపోలేదు. కానీ నిన్న ధనుష్ రాయన్ కి ఇచ్చిన నేపధ్య సంగీతం విన్నాక నమ్మకం పెరిగిందంటే అతిశయోక్తి కాదు. కంటెంట్ గొప్పగా లేకపోవచ్చు కానీ ఎన్నో సన్నివేశాలను తన బీజీఎమ్ తో నిలబెట్టేశారు రెహమాన్. తెలుగు, తమిళం అధిక శాతం రివ్యూలలో ఈ విషయాన్ని క్రిటిక్స్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. హీరోకు ఇచ్చిన సిగ్నేచర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎస్జె సూర్యతో తలపడినప్పుడు ఇచ్చిన ట్యూన్ ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి. ఇంతకు ముందు వినని కొత్త వాయిద్యాలు వాడారు.
కాకపోతే పాటలు తక్కువగా ఉన్నప్పటికీ మరీ ఎక్స్ ట్రాడినరి అనిపించకపోవడం ఒక్కటే రాయన్ మ్యూజిక్ పరంగా ఉన్న ఫిర్యాదు. ఉప్పెనతోనే తన అభిరుచిని చాటుకున్న బుచ్చిబాబు ఇప్పటికే రెహమాన్ ని చాలా సార్లు కలిసి తనకు కావాల్సిన అవుట్ ఫుట్స్ ని రాబట్టుకుంటున్నాడు. కథ విని చాలా ఎగ్జైట్ అయ్యాయని స్వయంగా సంగీత దిగ్గజమే చెప్పడం చూస్తే కంటెంట్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో చిరంజీవి సైరా నరసింహారెడ్డికి పని చేసే అవకాశాన్ని వదులుకున్న వచ్చిన రెహమాన్ ఇప్పుడు ఆయన వారసుడు రామ్ చరణ్ కు అదిరిపోయే ఆల్బమ్ ఇవ్వాలని అభిమానుల డిమాండ్.
This post was last modified on July 27, 2024 10:37 am
కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…
గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…