Movie News

పూరిని విడిచిపెట్టిన లైగర్ భూతం?

టాలీవుడ్లో ఒకప్పుడు వైభవం చూసిన దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. కానీ గత దశాబ్ద కాలంగా ఆయనకు పెద్దగా కలిసి రావడం లేదు. వరుసగా డిజాస్టర్లు ఎదుర్కొన్నాడు. మధ్యలో ‘ఇస్మార్ట్ శంకర్’ ఒక్కటి బాగా ఆడింది. కానీ అది ఫ్లూక్ హిట్ అనిపించేలా తర్వాతి చిత్రం ‘లైగర్’ పెద్ద డిజాస్టర్ అయింది.

పూరికి డిజాస్టర్లు కొత్తేమీ కాదు కానీ.. ‘లైగర్’ ఆయన్ని మరీ ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఈ సినిమాతో దారుణంగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆయన మీద పడిపోయారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని గొడవ గొడవ చేశారు. ‘లైగర్’ రిలీజ్ తర్వాత చాలా రోజుల పాటు ఈ వివాదం నడిచింది. ఐతే బిజినెస్ డీల్స్ నుంచి తనకు రావాల్సిన డబ్బులు రాలేదని.. అవి వస్తే సెటిల్ చేస్తానని.. లేదా కొత్త సినిమా రిలీజ్ టైంలో చూసుకుందామని పూరి వారికి హామీ ఇచ్చే ప్రయత్నం చేయగా.. అటు నుంచి సానుకూల స్పందన లేకపోయింది.

దీంతో అప్పట్లో పూరి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చిన ఆడియో ఒకటికి బయటికి వచ్చింది. కాగా పూరి కొత్త చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ ఆగస్టు 15న విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ‘లైగర్’ పంచాయితీ తప్పదనే అనుకున్నారంతా. ఇటీవలే ‘డబుల్ ఇస్మార్ట్’ థియేట్రికల్ హక్కులను పూరి ‘ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్’ నిరంజన్ రెడ్డికి అమ్మేయడంతో అనుకున్నట్లే ఫిలిం ఛాంబర్లో ‘లైగర్’ నష్టాల మీద పంచాయితీ మొదలైంది.

ఐతే ఇక్కడ జరిగిన చర్చలు, తీర్మానాల ప్రకారం పూరి సేఫ్ అని అంటున్నారు. ఒక సినిమా వల్ల బయ్యర్లు నష్టపోతే పరిహారం చెల్లించాలన్న రూల్ లేదని.. లాభాలు వచ్చినపుడు నిర్మాతకు పంచుతారా అనే వాదన నడిచిందని.. బయ్యర్లు పూరిని బ్లాక్‌మెయిల్ చేసిన నేపథ్యంలో ఆయన రివర్సయ్యారని.. ఈ నేపథ్యంలో అన్ని విషయాలూ పరిశీలించిన ఛాంబర్.. నైజాం ఏరియా వరకు ‘లైగర్’ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు పూరి సెటిల్మెంట్ చేయాల్సిన అవసరమేమీ లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. ‘లైగర్’ విషయంలో ప్రధానంగా గొడవ చేసింది నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీను అండ్ కోనే. ఇక్కడ వ్యవహారం సెటిలైపోవడంతో ఇక ఆంధ్రా బయ్యర్ల విషయంలో పూరి తనకు తానుగా ఏదైనా సెటిల్ చేయాలనుకుంటే చేసుకోవచ్చన్నమాట.

This post was last modified on July 26, 2024 9:39 am

Share

Recent Posts

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

44 minutes ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

1 hour ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

1 hour ago

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…

2 hours ago

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

5 hours ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

6 hours ago