Movie News

ఫౌజి అనుకున్న దానికన్నా వేగంగా

ఇంకా షూటింగ్ మొదలుకాకపోయినా ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కలయికలో తెరకెక్కబోయే ప్యాన్ ఇండియా సినిమా తాలూకు కబుర్లు ఎప్పటికప్పుడు లీకుల రూపంలో బయటికి వస్తూనే ఉన్నాయి. ఫౌజి టైటిల్ ఆల్రెడీ లీకైపోయింది. యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపు ఇదే ఖరారని యూనిట్ అనఫీషియల్ టాక్. హీరోయిన్ గా ఒక పాకిస్థానీ నటితో పాటు ఢిల్లీ మోడల్ గురించిన వార్తలు రెండు రోజుల క్రితం గట్టిగా చక్కర్లు కొట్టాయి. కానీ సీతారామంతో తనకు అచ్చి వచ్చిన మృణాల్ ఠాకూర్ ని ఒక కథయినాయికగా తీసుకునే ఆలోచనలో హను ఉన్నట్టు అంతర్గత సమాచారం.

ఇక ఫౌజిని ఎప్పుడు మొదలుపెడతారనే దాని గురించి స్పష్టమైన సమాచారం లేదు కానీ ఆగస్ట్ 15 స్వతంత్ర దినోత్సవం నాడు అనౌన్స్ మెంట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టైటిల్ కూడా అదే రోజు చెప్పొచ్చు. భారతదేశానికి ఇండిపెండెన్స్ రాక ముందు సుభాష్ చంద్రబోస్ కాలంలో జరిగిన కొన్ని సంఘటనల చుట్టూ హను రాఘవపూడి ఒక ప్రేమకథను అల్లారని తెలిసింది. కాకపోతే రాధే శ్యామ్ లాగా ల్యాగ్ అనిపించకుండా, భారతీయుడు 1 స్టైల్ లో కొత్త అనుభూతినిచ్చేలా డిఫరెంట్ ట్రీట్ మెంట్ రాసుకున్నారట. సీతారామం తరహాలో ఒక చక్కని కాఫీ తాగిన ఎక్స్ పీరియన్స్ కలిగిస్తుందట.

విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్న ఫౌజిని సలార్ తరహాలో వచ్చే ఏడాది డిసెంబర్ లో రిలీజ్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటారట. మైత్రి మూవీ మేకర్స్ దీనికి భారీ బడ్జెట్ కేటాయించబోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్ పూర్తి చేసే పని మీద ఉన్నాడు. సలార్ 2 శౌర్యంగపర్వం, కల్కి 2898 సెకండ్ పార్ట్ ఇంకొంచెం టైం పట్టేలా ఉండటంతో ఫౌజితోనే వెళ్లాలని ప్రభాస్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈలోగా స్పిరిట్ స్క్రిప్ట్ కూడా సిద్ధమైపోతుంది కాబట్టి గ్యాప్ రాకుండా ఒకేసారి రెండు మూడు సినిమాలు సెట్ల మీద ఉండేలా ప్లాన్ చేసుకోవచ్చు. ఎంత ఒత్తిడి ఉన్నా సరే ప్రభాస్ స్పీడ్ మాత్రం తగ్గేలా లేదు.

This post was last modified on July 26, 2024 9:26 am

Share

Recent Posts

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

1 hour ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

2 hours ago

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

10 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

11 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

11 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

11 hours ago