దర్శకుడిగా మొదట చేసే ప్రాజెక్టు ఒక స్థాయిలో ఉంటేనే తర్వాత ఇండస్ట్రీలో మంచి మంచి ఛాన్సులు వస్తాయని చాలామంది అనుకుంటారు. అందుకే చిన్నా చితకా ప్రాజెక్టులు చేయడానికి మనసొప్పదు. కానీ టాలెంట్ ఉండాలే కానీ.. చిన్న ప్రాజెక్టుల్లో కూడా ప్రతిభ చాటుకోవచ్చు. వాటిని పెద్ద హిట్ చేసి తర్వాత క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశం అందుకోవచ్చు. ఇందుకు ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ దర్శకుడు ఆదిత్య హాసన్ ఉదంతమే ఉదాహరణ.
అసలు లైమ్ లైట్లో లేని శివాజీని ప్రధాన పాత్రలో పెట్టి.. చాలా తక్కువ బడ్జెట్లో ‘నైంటీస్ మిడిల్ క్లాస్’ వెబ్ సిరీస్ తీశాడు ఆదిత్య. ఆ సిరీస్ చూస్తే పేరున్న ఆర్టిస్టులూ కనిపించరు. పెద్ద ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఏమీ ఉండవు. కానీ కంటెంట్‌తో అందరినీ మెప్పించి దీన్ని మోస్ట్ లవ్డ్ వెబ్ సిరీస్‌గా మార్చాడు ఆదిత్య.
దీంతో ఆదిత్యకు టాలీవుడ్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్‌కు డైలాగ్స్ రాసి మెప్పించిన ఆదిత్య.. ప్రస్తుతం నైంటీస్ మిడిల్ క్లాస్ సెకండ్ సీజన్ తీస్తున్నాడు. ఈలోపు సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నట్లు సమాచారం. ముందుగా అతను యూత్ స్టార్ నితిన్‌తో సినిమాను ఓకే చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం ‘రాబిన్ హుడ్’తో పాటు ‘తమ్ముుడు’ చిత్రంలో నటిస్తున్న నితిన్.. ఇంకో రెండు ప్రాజెక్టులు ఓకే చేశాడు. అందులో ఒకటి ‘ఇష్క్’ తర్వాత మళ్లీ విక్రమ్ కుమార్‌తో చేయబోయే చిత్రం. ఇంకోటి ఆదిత్య హాసన్ మూవీ అట. దీన్ని ఓ ప్రముఖ నిర్మాత ప్రొడ్యూస్ చేయబోతున్నాడట. స్క్రిప్టు ఓకే అయిందని.. నితిన్, ఆదిత్య ఇద్దరూ ఖాళీ అయ్యాక ఈ సినిమా చేస్తారని సమాచారం. వెబ్ సిరీస్‌తో మెప్పించిన ఆదిత్య.. సినిమాతోనూ సక్సెస్ కొడితే టాలీవుడ్లో బిజీ డైరెక్టర్లలో ఒకడైపోతానడంంలో సందేహం లేదు.
This post was last modified on July 25, 2024 3:10 pm
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…