సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కలయికలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందాని అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆగస్ట్ 9 హీరో పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ మెంట్ ఉంటుందేనని ఫ్యాన్స్ ఆశపడ్డారు కానీ అది నెరవేరేలా కనిపించడం లేదు. ప్రస్తుతం జక్కన్న హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వర్క్ షాప్ నిర్వహిస్తూ బిజీగా ఉన్నాడని సమాచారం. మహేష్ లుక్కు కోసం ఒక ఫోటో షూట్ చేశారట కానీ ఇంకా ఫైనల్ చేయలేదని వినికిడి. ఇక స్క్రిప్ట్ దాదాపు లాకైపోయింది. దానికి సంబంధించిన కొన్ని లీక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
ఎస్ఎస్ఎంబి 29 కథలోని కీలకమైన పాయింట్ అంతులేని బంగారు సంపద చుట్టూ తిరుగుతుందట. అమెజాన్ లాంటి డీప్ ఫారెస్ట్ లో ప్రమాదకరమైన జంతువులు, పరిస్థితుల మధ్య హీరో చేసే వేట మెయిన్ హైలైట్ గా చెబుతున్నారు. ఇలాంటి స్టోరీతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. కృష్ణగారి మోసగాళ్లకు మోసగాడు మంచి ఉదాహరణ. అయితే వాటిలో లేని ఒక విభిన్నమైన ఫాంటసీ టచ్ ని విజయేంద్ర ప్రసాద్ ఇచ్చారని తెలిసింది. దాని తాలూకు విజువల్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో డిజైన్ చేశారట. ఇండియానా జోన్స్ స్ఫూర్తిగా తీసుకున్న రాజమౌళి దాన్ని తలదన్నేలా ప్లాన్ చేశారట.
అంతే కాదు ముందు అనుకున్న మహారాజ టైటిల్ విజయ్ సేతుపతి వాడేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు కొత్త పేరు కోసం అన్వేషణ జరుగుతోందని తెలిసింది. వాటిలో గోల్డ్ అన్ని భాషలకు కనెక్ట్ అయ్యేలా ఉందని మెజారిటీ అభిప్రాయం వ్యక్తం చేశారని ఇన్ సైడ్ న్యూస్. కాకపోతే అక్షయ కుమార్ దీన్ని ఆ మధ్య పెట్టేసుకున్నాడు కాబట్టి చివరికి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మహేష్ బాబు కనీసం రెండు నుంచి మూడేళ్లు దీని కోసం త్యాగం చేయాల్సి వచ్చేలా ఉంది. ప్రభాస్ కి బాహుబలి ఎలా నిలిచిపోయిందో మహేష్ కు ఈ జక్కన్న మూవీ అంతకు పదిరెట్లు ఎలివేట్ చేసేలా మేకింగ్ ఉంటుందట.
This post was last modified on July 25, 2024 12:50 pm
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…