స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ పేరిట హీరోయిన్ కాకుండా వేరే భామను తీసుకొచ్చి హీరోతో ఆడిపాడించడం కొత్తేమి కాదు. ఒకప్పుడు వీటి కోసం ప్రత్యేకంగా సిల్క్ స్మిత, జయమాలిని లాంటి వాళ్ళు ఈ పాటల వల్లే విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడా ట్రెండ్ మారిపోయి ఏకంగా మెయిన్ స్ట్రీమ్ కథానాయికలు ఆ బాధ్యతను తీసుకుని అదనపు ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ముఖ్యంగా మిల్కీ బ్యూటీ తమన్నా ఆయా చిత్రాలకు హిట్ సెంటిమెంట్ గా మారిపోతోంది. ఒక్కసారి ట్రాక్ రికార్డు గమనిస్తే ఇది అర్థమైపోతుంది.
రజనీకాంత్ జైలర్ లో వా నువ్ రావాలయ్యా ఎంత పెద్ద ఛార్ట్ బస్టరో ప్రత్యక్షంగా చూశాం. చివరి నిమిషంలో పెట్టిన ఈ పాట సక్సెస్ లో తనదైన పాత్ర పోషించింది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ ప్రారంభంలో వచ్చే మిలిటరీ స్పెషల్ సాంగ్ డాంగ్ డాంగ్ లో హుషారైన స్టెప్పులు మంచి కిక్ ఇచ్చాయి. కెజిఎఫ్ చాప్టర్ 1 సౌత్ వెర్షన్ లో ఉన్నది తమన్నానే. ఇది ఎంత పెద్ద బ్లాక్ బస్టరో చెప్పేదేముంది. ఇంకా వెనక్కు వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ అల్లుడు శీను ఇలా లిస్టు పోతూనే ఉంటుంది. మధ్యలో వరుణ్ తేజ్ గని లాంటి ఒకటి రెండు షాకులు లేకపోలేదు.
ఇప్పుడీ టాపిక్ ఎందుకంటే వచ్చే నెల ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న బాలీవుడ్ మూవీ స్త్రీ 2లో తమన్నా చేసిన పాట ఆజ్ కీ రాత్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. అందాలను ఒలకబోస్తూ వయ్యారంగా వేసిన స్టెప్పులు వైరలవుతున్నాయి. షార్ట్స్ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పాట లాంచ్ ఈవెంట్ లో శ్రద్దా కపూర్ మాట్లాడుతూ తమన్నా డాన్సుల గురించి ఓ రేంజ్ లో ప్రశంసల వర్షం కురిపించింది. స్త్రీ 2 మార్కెటింగ్ లో తన పాట కీలకంగా మారిపోయింది. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హిందీలో డబుల్ ఇస్మార్ట్, ఖేల్ ఖేల్ మే, వేదాలతో ఈ సినిమాకు పెద్ద పోటీనే ఎదురుకానుంది.
This post was last modified on July 25, 2024 12:49 pm
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…
తిరుమల తొక్కిసలాట ఘటనపై శుక్రవారం సాయంత్రం టీటీడీ అత్యవసరంగా భేటీ అయి సమీక్షించింది. ఈ సమావేశంలో భాగంగా మృతుల కుటుంబాలకు…