గత నెల జూన్ ఆఖరున వచ్చిన కల్కి 2898 ఏడి బ్లాక్ బస్టర్ రికార్డులతో థియేటర్లను కళకళలాడించగా అదే జోరును జూలైలో కొత్త సినిమాలు కొనసాగిస్తాయని బయ్యర్లు ఆశగా ఎదురు చూశారు. కానీ ఇప్పటిదాకా అలా జరగలేదు. కల్కి దెబ్బకు మొదటి వారంని అందరూ వదిలేయగా సెకండ్ వీక్ లో వచ్చిన భారతీయుడు 2 నిండా ముంచేసింది. డిజాస్టర్ టాక్ తోడు తెలంగాణలో కోరి పెంచుకున్న టికెట్ రేట్లు మరింత చేటు కలిగించాయి. ఆపై వారం ప్రియదర్శి డార్లింగ్ తీవ్రంగా నిరాశపరచగా మంచి ప్రమోషన్లు చేసుకున్న పేకమేడలు, ది బర్త్ డే బాయ్ లు సైతం ఎలాంటి అద్భుతాలు చేయలేకపోయాయి.
ఇప్పుడు చివరి వారం వచ్చేసింది. రేపు ముక్కోణపు పోటీ ఉంది. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది డబ్బింగ్ మూవీ రాయన్. ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ మాఫియా డ్రామాలో సందీప్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. ఎస్జె సూర్య విలనీ, ఏఆర్ రెహమాన్ సంగీతం లాంటి భారీ ఆకర్షణలు పూర్తి స్థాయిలో బజ్ ని తీసుకురాలేకపోతున్నాయి. తమిళనాడు బుకింగ్స్ చాలా బాగున్నప్పటికీ తెలుగులో హైదరాబాద్ మినహాయించి మిగిలిన చోట్ల చాలా నెమ్మదిగా ఉన్నాయి. మహారాజ తరహాలో టాక్ క్రమంగా పెరిగి జనాలు వస్తే సూపర్ హిట్ పడొచ్చు. అది కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది.
రాజ్ తరుణ్ పురుషోత్తముడు రేపే వస్తోంది. హీరో లేకుండానే ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషన్లు చేసేశారు. పెద్ద క్యాస్టింగ్, టాప్ టెక్నీషియన్స్ పని చేసిన ఈ విలేజ్ మాస్ డ్రామాకు గోపి సుందర్ సంగీతం అందించారు. హడావిడి లేకపోయినా టాక్ తో జనమే తమకు పబ్లిసిటీ చేస్తారని టీమ్ బలంగా నమ్ముతోంది. పలాస ఫేమ్ రక్షిత్ హీరోగా రూపొందిన ఆపరేషన్ రావణ్ విడుదల కూడా రేపే. ఇది క్రైమ్ థ్రిల్లర్ జానర్. ఇవి కాకుండా ఇంకో రెండు చిన్న సినిమాలు బరిలో ఉన్నాయి కానీ వాటి ఊసే ప్రేక్షకుల్లో లేదు. మరి త్రికోణ యుద్ధంలో ఎవరిది గెలుపవుతుందో ఇంకో ఇరవై నాలుగు గంటల్లో తేలనుంది. చూద్దాం.
This post was last modified on July 25, 2024 11:15 am
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై ఈసారి చాలా ఆసక్తిగా మారబోతోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి దుబాయ్, పాకిస్థాన్ వేదికలుగా…