Movie News

రాజ‌మౌళిపై వ‌ర్మ అభిప్రాయం.. ఏకీభ‌వించ‌ట్లేదు

ఒక‌ప్పుడు ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీలోనే నంబ‌ర్ వ‌న్ ద‌ర్శ‌కుడ‌నే పేరు సంపాదించాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. కానీ గ‌త ప‌ది ప‌దేహేనేళ్ల నుంచి చెత్త చెత్త సినిమాలు తీస్తూ ద‌ర్శ‌కుడిగా ప‌త‌నం అయిపోయాడు. ఇప్పుడు వేరే ద‌ర్శ‌కులను పొగుడుతూ కాల‌క్షేపం చేస్తున్నాడు. గ‌త కొన్నేళ్ల‌లో త‌న వ్య‌వ‌హార శైలి వ‌ల్ల బాగా నెగెటివిటీ తెచ్చుకున్నప్ప‌టికీ.. ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో ఆయ‌న అభిప్రాయాల‌కు కొంద‌రు విలువ‌నిస్తూ చ‌ర్చ‌లు పెడుతుంటారు.

తాజాగా వ‌ర్మ వెలిబుచ్చిన ఓ అభిప్రాయం మీద సోష‌ల్ మీడియాలో చ‌ర్చ న‌డుస్తోంది. రాజ‌మౌళిని వ‌ర్మ ఎలా కొనియాడుతుంటాడో తెలిసిందే. ఇటీవ‌లే నెట్‌ఫ్లిక్స్.. జ‌క్క‌న్న మీద ఒక డాక్యుమెంట‌రీ తీసిన నేప‌థ్యంలో వ‌ర్మ ఆయ‌న గురించి ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు.

రాజ‌మౌళి ఘ‌న‌త‌ల్ని తెలుగు వారికి ఆపాదించ‌డం క‌రెక్ట్ కాద‌ని.. ఆయ‌న గుజ‌రాత్‌లో పుట్టి ఉన్నా ద‌ర్శ‌కుడిగా ఇలాగే ఎదిగేవాడ‌ని.. ఇలాంటి అద్భుత చిత్రాలే తీసి ప్ర‌పంచ స్థాయికి చేరుకునేవాడ‌ని అన్నాడు వ‌ర్మ‌. కానీ ఈ అభిప్రాయంతో మెజారిటీ నెటిజ‌న్లు ఏకీభ‌వించ‌ట్లేదు.

తెలుగు వారి సినీ అభిమాన‌మే లేకుంటే.. రాజ‌మౌళి ఈ స్థాయికి ఎదిగేవాడే కాద‌ని అంటున్నారు. మ‌న వాళ్ల సినిమా పిచ్చి వ‌ల్లే రాజ‌మౌళి సినిమాల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు అద్భుత‌మైన ఆద‌ర‌ణ ద‌క్కింద‌ని.. వారిని మ‌రింత‌గా సంతృప్తి ప‌ర‌చ‌డానికి త‌న‌ను తాను మ‌లుచుకుంటూ పెద్ద పెద్ద క‌లలు కంటూ ఎదిగాడ‌ని.. ఆయ‌న్ని ఇన్‌స్పైర్ చేసింది తెలుగు ప్రేక్ష‌కుల వ‌ల్ల‌మాలిన అభిమాన‌మే అని నెటిజన్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అలాగే తెలుగు సినిమా మార్కెట్ ప‌రిధి వ‌ల్లే రాజ‌మౌళి సినిమాల‌కు రీచ్ కూడా పెరిగింద‌ని.. అందువ‌ల్లే భారీ బ‌డ్జెట్ల‌లో జ‌క్క‌న్న అద్భుత‌మైన సినిమాలు తీసి త‌న స్థాయిని పెంచుకుంటూ వెళ్ల‌గ‌లిగాడ‌ని.. ఆయ‌న గుజ‌రాత్ లాంటి రాష్ట్రంలో ఉంటే చిన్న స్థాయిలో ఏవో రీజ‌న‌ల్ సినిమాలు చేసుకుంటూ ఉండిపోయేవాడ‌ని ప‌లువురు నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

This post was last modified on July 25, 2024 6:55 am

Share

Recent Posts

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

5 minutes ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

2 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

3 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

4 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

4 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

4 hours ago