మూడేళ్లకు పైగా వరుస ఫ్లాపులతో అల్లాడిపోతున్న యువ కథానాయకుడు రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా మీదే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ చిత్రం థియేటర్లలో రిలీజై మంచి విజయం సాధించి తనకు లైఫ్ ఇస్తుందని అనుకున్నాడు. కానీ అతడి ప్రణాళికలు ఫలించలేదు. అనివార్య పరిస్థితుల్లో ఈ సినిమాను ‘ఆహా’లో రిలీజ్ చేసేస్తున్నారు.
కాస్టింగ్ వల్ల కావచ్చు, సరైన ప్రోమోలు రిలీజ్ చేయకపోవడం వల్ల కావచ్చు.. ఈ సినిమాపై పెద్దగా బజ్ అయితే లేదు. పైగా ఈ సినిమా రిలీజవుతున్న అక్టోబరు 2నే అనుష్క సినిమా ‘నిశ్శబ్దం’ను విడుదల చేస్తుండటంతో జనాల ఫోకస్ మొత్తం దాని మీదే ఉంది. ‘ఒరేయ్ బుజ్జిగా’ గురించి డిస్కషనే లేదు. ఐతే కంటెంట్ బాగుంటే నెమ్మదిగా అయినా సినిమా చర్చల్లోకి వస్తుందని.. జనాల నుంచి మంచి స్పందన రాబట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు.
‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాను రూపొందించిన విజయ్ కుమార్ కొండా ‘గుండె జారి గల్లంతయ్యిందే’ లాంటి సూపర్ హిట్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత నాగచైతన్య, పూజా హెగ్డేలతో అన్నపూర్ణ స్టూడియో బేనర్లో ‘ఒక లైలా కోసం’ లాంటి కొంచెం పెద్ద ప్రాజెక్టునే డీల్ చేశాడు. ఆ సినిమా నిరాశ పరచడంతో కొంత కాలం ఖాళీగా ఉండాల్సి వచ్చింది. తర్వాత రేంజ్ తగ్గించుకుని రాజ్‌తో సినిమా చేయాల్సి వచ్చింది. ఈ సినిమా పూర్తయ్యే సమయానికి అతడికి కన్నడలో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ హీరోగా ‘రైడర్’ మూవీ చేసే అవకాశం వచ్చింది.
అది కొంచెం పెద్ద బడ్జెట్లోనే తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో ‘ఒరేయ్ బుజ్జిగా’ మీద పెద్దగా ఫోకస్ పెట్టినట్లు కనిపించలేదు. ‘రైడర్’తో హిట్టు కొట్టి అక్కడే సెటిలైపోతాడేమో అనుకుంటే.. ఆ సినిమా ఆరంభ దశలో ఉండగానే.. మళ్లీ రాజ్ తరుణ్‌తో ఓ సినిమా ఆరంభించి షాకిచ్చాడు. వనమాలి క్రియేషన్స్ అనే కొత్త సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఓవైపు ‘రైడర్’ చేస్తూ.. ఇక్కడ రాజ్‌తో సినిమా మొదలుపెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఈ రెండు ప్రాజెక్టులనూ ఒకేసారి ఎలా డీల్ చేస్తాడో.. రాజ్‌తో సినిమాను ఎలా వర్కవుట్ చేస్తాడో చూడాలి.
This post was last modified on September 25, 2020 12:34 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…