ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఎన్బికె 109 చేస్తున్న బాలకృష్ణ దాని తర్వాత బోయపాటి శీనుతో అఖండ 2ని అధికారికంగా లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. టైటిల్ ప్రకటించనప్పటికీ విశ్వసనీయమైన సమాచారం మేరకు ఇదేనని తెలిసింది. భారీ బడ్జెట్ తో 14 రీల్స్ నిర్మాణంలో రూపొందబోయే ఈ యాక్షన్ డ్రామాకు సంగీతం ఎవరనే దాని గురించి ఇప్పటిదాకా సరైన సమాచారం లేదు. తమనే ఉంటాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు కానీ ఈసారి మార్చే ఆలోచన సీరియస్ గానే జరుగుతోందట. ఎందుకంటే తమన్ బాలయ్యతో వరసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఎన్బికె 109 చేశాడు.
ఇప్పుడు వరసగా అయిదోది సమాజనం కాదని యూనిట్ భావిస్తోందట. అందుకే యానిమల్ తో దేశవ్యాప్తంగా మ్యూజిక్ లవర్స్ దృష్టిలో హర్షవర్ధన్ రామేశ్వర్ ని మొదటి ఆప్షన్ గా చూస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ఇతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి పెద్ద ఎత్తున అభిమానులున్నారు. హీరోయిజం ఉన్న సీన్లను ఎలివేట్ చేయడంలో ఇతనికితనే సాటి. అర్జున్ రెడ్డిలోనూ ఇది ఋజువయ్యింది. కాకపోతే స్టార్ హీరోల అవకాశాలు రాక కొంత వెనుకబడ్డాడు. కానీ యానిమల్ తో తానేంటో రుజువు చేసుకోవడంతో క్రమంగా స్టార్ హీరోలు తన వైపు చూస్తున్నారు. వాటిలో భాగంగానే బాలయ్య 110 వచ్చిండొచ్చు.
ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు కాబట్టి నిర్ధారణగా చెప్పలేం కానీ నిప్పు లేనిదే పొగరాదనే సామెతను కూడా మర్చిపోకూడదు. అఘోరా పాత్రను ఎక్కువ హైలైట్ చేస్తూ అఖండ 2 స్క్రిప్ట్ ని అంచనాలకు మించి బోయపాటి శీను సిద్ధం చేశారట. క్యాస్టింగ్ తదితర పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇంకో రెండు నెలల వరకు బాలయ్య బిజీగా ఉండటంతో ఎప్పటి నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయాలనే దాని మీద ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సింహా, లెజెండ్, అఖండ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ కాంబో కావడంతో ప్రాజెక్టు మీద బిజినెస్ వర్గాల్లో విపరీతమైన హైప్ నెలకొంది.
This post was last modified on July 24, 2024 11:41 am
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…