కెజిఎఫ్ తర్వాత అభిమానులు ఎంత ఒత్తిడి తెచ్చినా రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్న హీరో యష్ ఎట్టకేలకు టాక్సిక్ ఒప్పుకుని ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్లను కాకుండా కమర్షియల్ సినిమా హ్యాండిల్ చేసిన అనుభవం లేని గీతూ మోహన్ దాస్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా అందరికీ చిన్నపాటి షాక్ ఇచ్చాడు. టాక్సిక్ ని తక్కువంచనా వేస్తున్న వాళ్ళు లేకపోలేదు. అయితే ఇది అనుకున్నంత ఆషామాషీగా ఉండదని యూనిట్ టాక్. మెయిన్ హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తుండగా రెండో కథానాయికగా తారా సుతారియా ఎంపికయ్యిందని లేటెస్ట్ అప్డేట్.
1950 నుంచి 1970 మధ్యలో గోవా కేంద్రంగా జరిగిన డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ ని టాక్సిక్ కోసం తీసుకున్నారు. హ్యూమా ఖురేషి నెగటివ్ రోల్ లో కనిపించనుండగా నయనతార యష్ కి అక్కయ్యగా కనిపించనుంది. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద చూడని డార్క్ విజువల్స్ ఇందులో ఉంటాయనే లీక్స్ ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు పెంచుతున్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ ని ఒళ్ళు జలదరించే రీతిలో ప్లాన్ చేశారట. రెండు వందల రోజుల షూటింగ్ కు సరిపడా షెడ్యూల్స్ ని సెట్ చేసుకున్నారు. గోవాలో కొంత భాగం విదేశాల్లో అధిక శాతం చిత్రీకరణ జరపబోతున్నారు.
సుమారు రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న టాక్సిక్ వచ్చే ఏడాది ఏప్రిల్ కి విడుదల కానుంది. కెజిఎఫ్ ఇచ్చిన స్టార్ డం వాడుకోకుండా స్క్రిప్ట్ కోసమే విపరీతమైన జాప్యాన్ని తట్టుకుంటూ వచ్చిన యష్ కి దీని సక్సెస్ చాలా కీలకం. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో దీనికి కొంత బ్రేక్ ఇచ్చి నితీష్ తివారి బాలీవుడ్ రామాయణంలో పాల్గొంటాడని సమాచారం. మొదటి భాగంలో తనవరకు ఎక్కవ సీన్లు లేకపోవడంతో వేగంగానే పూర్తి చేయబోతున్నారు. దీనికి సహనిర్మాతగానూ వ్యవహరిస్తున్న యష్ టాక్సిక్ రిలీజయ్యాక పూర్తి డేట్లు రామాయణం 2కి ఇవ్వబోతున్నాడు. టాక్సిక్ మాత్రం ఒక్క పార్టేనట.
This post was last modified on July 23, 2024 10:06 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…