ఆ భాష, ఈ భాష అని తేడా లేదు. అన్ని భాషల్లోనూ రీమేక్ సినిమాల జోరు నడుస్తోంది. ఒకప్పటితో పోలిస్తే భాషల మధ్య అంతరం చెరిగిపోయి అన్ని భాషల చిత్రాలనూ అందరూ చూసేస్తున్నప్పటికీ.. రీమేక్ సినిమాల సక్సెస్ రేట్ తగ్గిపోతున్నప్పటికీ… వాటి మీద మోజేమీ తగ్గిపోవట్లేదు. తెలుగులో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఒకటికి రెండు రీమేక్‌లను లైన్లో పెడితే.. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ రీమేక్‌తోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
విక్టరీ వెంకటేష్ సైతం రీమేక్ సినిమాలో నటిస్తుండగా.. ఇంకొందరు హీరోలు కూడా రీమేక్‌ల్లో నటిస్తున్నారు. యువ కథానాయకుడు నితిన్ చాలా కాలం తర్వాత ఓ రీమేక్ సినిమాలో నటించనున్నాడు. అదే.. అందాదున్. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ లాంటి హిట్ సినిమాలు తీసిన మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకుడు. నితిన్ ఆల్రెడీ ‘భీష్మ’ హిట్‌తో ఊపులో ఉండగా.. తమన్నా, నభా నటేష్ లాంటి హాట్ భామలు ఇందులో కీలక పాత్రలు పోషించనున్నారు.
ఐతే ‘అందాదున్’ తెలుగు రీమేక్ పట్టాలెక్కే సమయానికే తమిళంలో సైతం రీమేక్ మొదలు కాబోతుండటం విశేషం. ఐతే అందులో నటించబోయే హీరో పేరు వింటే నిరుత్సాహం కలగక మానదు. ఒకప్పుడు ‘జీన్స్’ సహా కొన్ని హిట్ సినిమాల్లో నటించిన సీనియర్ హీరో ప్రశాంత్ ఇందులో హీరో అట. అతను హీరోగా ఫామ్ కోల్పోయి చాలా ఏళ్లయింది. అక్కడి జనాలు అతణ్ని పట్టించుకోవడమే మానేశారు. హిందీలో ఆయుష్మాన్ ఖురానా అదరగొట్టిన రోల్‌లో ఎవరైనా యువ నటుడు నటిస్తే బాగుంటుంది కానీ.. పూర్తిగా ఫామ్ కోల్పోయి, పాతబడిపోయిన ప్రశాంత్ అందులో హీరోగా నటించడమేంటో అర్థం కావడం లేదు. ఈ విషయమై తమిళ జనాల నుంచి నెగెటివ్ ఫీడ్ బ్యాకే వస్తోంది.
‘తనీ ఒరువన్’ లాంటి బ్లాక్‌బస్టర్ తీసిన మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకు ముందు మోహన్ తీసిన సినిమాలు చాలా వరకు రీమేక్‌లే. తెలుగులో బ్లాక్‌బస్టర్లయిన జయం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు లాంటి సినిమాలను తమ్ముడు రవితో అతను రీమేక్ చేశాడు. ఇప్పుడు కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ రీమేక్‌ను హ్యాండిల్ చేయబోతున్నాడు.
This post was last modified on September 25, 2020 11:10 am
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…