ఈ ప్రశ్నను ఇప్పుడు టాలీవుడ్ లో ఇద్దరు దర్శకులు పదే పదే వేసుకుంటున్నారు. ప్రస్తుతం అనిరుధ్ రవిచందర్ విపరీతమైన పని ఒత్తిడిలో ఉన్నాడు. ఇటు చూస్తేనేమో సెప్టెంబర్ 27 విడుదల తేదీ ప్రకటించి కూర్చున్న దేవరకు సంబంధించిన వర్క్ ఇంకా ఉంది. రెండో లిరికల్ సాంగ్ తన వల్లే లేట్ అవుతోందని యూనిట్ టాక్. లేకపోతే ఈపాటికి రిలీజ్ చేసి ఉండేవాళ్ళని సమాచారం. షూట్ అయ్యాక ఫైనల్ కాపీ సిద్ధం చేసి ఇస్తే రీ రికార్డింగ్ కి ఎంత టైం తీసుకుంటాడోననే టెన్షన్ తారక్ అభిమానుల్లో విపరీతంగా ఉంది. ఫియర్ సాంగ్ ఛార్ట్ బస్టర్ అయ్యాక ప్రతిదీ అంతకు మించి ఆశిస్తున్నారు.
కొరటాల శివ ఈసారి బీజీఎమ్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు. ఆచార్య విషయంలో వచ్చిన నెగటివిటిలో ఇది కూడా ప్రధాన అంశం అయ్యింది కానీ ఈసారి క్వాలిటీపరంగా రాజీ పడే ప్రసక్తే లేదని చెబుతున్నారట. మరి అనిరుధ్ ఎంత వేగంగా నాణ్యతతో ఇస్తాడానేది ఇచ్చే సమయం మీద ఆధారపడి ఉంటుంది. ఇక రెండో వ్యక్తి గౌతమ్ తిన్ననూరి. కొత్తవాళ్ళతో సితార బ్యానర్ లో తీసిన మేజిక్ సినిమా ఎడిటింగ్ పూర్తి చేసుకుని రెడీగా ఉందట. దీనికి అనిరుధ్ సంగీతం ఇవ్వాలి. విజయ్ దేవరకొండ 12తో పాటు దీన్ని కంబైన్డ్ ప్యాకేజీగా తనను తీసుకున్నారు. ఇప్పుడదే సమస్య అయ్యింది.
ఇక కాసేపు తమిళం సంగతి చూస్తే ఇండియన్ 3, అజిత్ విదామయార్చి, విగ్నేష్ శివన్ లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, రజనీకాంత్ వెట్టయాన్ మీద ఒకేసారి పని చేస్తున్నాడు అనిరుధ్. ఏదీ పక్కనపెట్టలేని, వాయిదా వేయలేని పరిస్థితి. ఇంకోవైపు కూలి కంపోజింగ్ చేయమని లోకేష్ కనగరాజ్ ఒత్తిడి చేస్తున్నాడట. చెన్నై దాటి బయట కాలు పెట్టేందుకు లేకుండా పోతోందని అతని సన్నిహితులు అంటున్నారు. మరి దేవర, మేజిక్ కోసం ఎప్పుడు టైం ఇస్తాడనేది వేచి చూడాలి. ఇండియన్ 2లో తన పనితనం మీద వచ్చిన విమర్శలకు అనిరుధ్ కొంత డిస్టర్బ్ అయ్యాడని వినికిడి.
This post was last modified on July 23, 2024 5:26 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…