ఆలు లేదు చూలు లేదు సామెత స్టార్ హీరోల కొత్త సినిమాల ప్రచారానికి సరిగ్గా సరిపోతుంది. కల్కి 2898 ఏడి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ ది రాజా సాబ్ పూర్తయ్యాక ఏ మూవీ చేస్తాడనే స్పష్టత ఇప్పటిదాకా లేకపోయినా హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే చిత్రమే ఉంటుందని నమ్మకమైన సోర్స్ నుంచి వస్తున్న సమాచారం. అధికారికంగా ప్రకటించే దాకా ఏదీ ఖరారుగా చెప్పలేం కానీ తాజాగా ఇందులో హీరోయిన్ గురించి జరుగుతున్న ప్రచారం, ఒకటి కాదు ఏకంగా రెండు పేర్లు చక్కర్లు కొట్టడం అయోమయానికి గురి చేస్తోంది.
మొదటి అమ్మాయి పేరు ఇమాన్ ఇస్మాయిల్. ఢిల్లీకి చెందిన ఈ డాన్సర్ కం కొరియోగ్రాఫర్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఢిల్లీలో పుట్టి పెరిగి ఎంబీఏ చదివి అమెరికాలోనూ నృత్యానికి సంబంధించిన శిక్షణ తీసుకుంది. మ్యూజిక్ వీడియోలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళకు ఈమె సుపరిచితురాలు. 2012లో యూట్యూబ్ ఛానల్ పెట్టి కనిష్టంగా మూడు నుంచి అయిదు లక్షల నెలసరి ఆదాయం అందుకుంటున్న సెలెబ్రిటిగా పేరుంది. పలు బ్రాండ్లకు సైతం పని చేసింది. ఈమెను ఇన్స్ టాలో హను రాఘవపూడి ఫాలో అవుతున్నారట. ఇక రెండో ఆప్షన్ చూద్దాం.
ఆమె పేరు సజల్ ఆలీ. శ్రీదేవి మామ్ లో నటించాక పేరు వచ్చింది. పాకిస్థాన్ కు చెందిన ఈ మోడల్ కు 10 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. అభిమానులు భారీగా పెరుగుతున్నారు. ఇద్దరూ ముస్లిం యువతులు కావడం గమనార్హం. ఫౌజీ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామాని సీతారామం లాగా ప్రేమకథగా కాకుండా యాక్షన్ డ్రామాగా హను రాఘవపూడి చెప్పబోతున్నట్టు సమాచారం. అఫీషియల్ గా ఏదీ చెప్పకుండానే ఇంత చర్చ జరుగుతోందంటే అది ప్రభాస్ మహాత్యమే. అసలు వీళ్లిద్దరూ కాకుండా హఠాత్తుగా మూడో పేరు తెరమీదకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
This post was last modified on July 22, 2024 10:39 pm
గత కొన్నేళ్లలో తమిళ సినిమాల క్వాలిటీ బాగా పడిపోయిన మాట వాస్తవం. ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ సినిమాలు తీసే ఇండస్ట్రీగా…
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రెసిడెంట్ చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్న బాలకృష్ణకు పౌరసన్మాన సభ ఘనంగా జరిగింది. వేలాదిగా…
టీడీపీకి ప్రాణ సమానమైన కార్యక్రమం ఏదైనా ఉంటే.. అది మహానాడే. దివంగత ముఖ్యమంత్రి, తెలుగువారిఅన్నగారు ఎన్టీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని..…
మే 9 విడుదల కాబోతున్న సినిమాల్లో సమంత నిర్మించిన శుభం ఉంది. ప్రొడ్యూసర్ గా వ్యవహరించడమే కాదు ఒక క్యామియో…
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రెండు రోజుల కిందటే అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించారు. రాజధాని పనులకు పునః ప్రారంభం కూడా…
యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్లతో యువ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగే సంపాదించాడు శ్రీ విష్ణు. గత ఏడాది అతడి నుంచి…