సినీ ప్రియుల్లో ఎక్కడ చూసినా ఆగస్ట్ 15 వస్తున్న సినిమాల పోటీ చర్చే జరుగుతోంది. మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, ఆయ్, 35 చిన్న కథ కాదు, తంగలాన్ ఇలా ఏకంగా అయిదు చిత్రాలు నువ్వా నేనాని తలపడుతుండటంతో థియేటర్ల సర్దుబాటు గురించి డిస్ట్రిబ్యూటర్ల మధ్య అప్పుడే హాట్ డిస్కషన్స్ మొదలయ్యాయి. హిందీ నుంచి స్త్రీ 2, ఖేల్ ఖేల్ మేన్, వేదాలు రిలీజ్ కాబోతున్నాయి. నగరాల మల్టీప్లెక్సుల్లో వీటికి స్క్రీన్లు కేటాయించాల్సి ఉంటుంది. ఇంత హడావిడిలోనూ స్వాతంత్ర దినోత్సవం నాడు రిలీజ్ కాబోతున్న కీర్తి సురేష్ చిత్రం రఘుతాత తగ్గనంటోంది.
కెజిఎఫ్ నిర్మించిన హోంబాలే ఫిలింస్ నుంచి వస్తున్న రఘు తాతలో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించింది. నిన్న చెన్నైలో ఆడియో లాంచ్ చేశారు. నిజానికి ఆగస్ట్ 15 రేస్ నుంచి తప్పుకుంటుందని తొలుత అందరూ భావించారు కానీ అదేమీ లేదట. ఇండిపెండెన్స్ డేకే వస్తుందని నిర్మాతలు చెబుతున్నారు. టీజర్ టైంలో దీని మీద కొంత వివాదం నడిచింది. తమిళనాడులో హిందూ వ్యతిరేకతను ఆధారంగా చేసుకుని దానికి మహిళా సమస్యకు ముడిపెట్టి దర్శకుడు సుమన్ కుమార్ తెరకెక్కించారు. అయితే ఇందులో ఎలాంటి రాజకీయ అంశాలు ఉండవని కీర్తి సురేష్ క్లారిటీ ఇస్తోంది.
చూస్తుంటే తెలుగులో రఘు తాత సమాంతరంగా విడుదల కావడం అనుమానంగానే ఉంది. అయితే హోంబాలే బ్యానర్ కాబట్టి బయ్యర్ల మద్దతు ఏమైనా దొరికితే కాసిన్ని థియేటర్లతో సర్దుకోవచ్చు. ఒకవేళ లేట్ అయితే మాత్రం ఇబ్బందే. ఎందుకంటే గతంలో శివ కార్తికేయన్ అయలాన్, ధనుష్ కెప్టెన్ మిల్లర్ లు పోటీ వల్ల సంక్రాంతి బరి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దాని ఫలితంగా ఒకటి అసలు డబ్బింగ్ రిలీజే కాకపోగా మరొకటి దారుణంగా డిజాస్టరయ్యింది. మరి రఘు తాత లేట్ వస్తానంటాడో లేదో చూడాలి. కీర్తి సురేష్ కున్న ఇమేజ్ దృష్ట్యా సేమ్ టైం రిలీజ్ కోసమే చూస్తున్నారు రఘు తాత నిర్మాతలు.
This post was last modified on July 21, 2024 6:41 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…