ఏదైనా ఒక పెద్ద, క్రేజీ సీజన్ వచ్చిందంటే.. సినిమాలు పోటాపోటీగా విడుదలకు రెడీ అయిపోతాయి. సంక్రాంతితో మొదలుపెడితే.. ఇలా క్లాష్ గట్టిగా ఉండే సీజన్లు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నాయి. వచ్చే నెలలో ఇండిపెండెన్స్ డే వీకెండ్ కోసం టాలీవుడ్లో అరడజను సినిమాల దాకా రెడీ అవుతుండటం విశేషం.
ఇక ఈ ఏడాదిలో ఎక్కువ పోటీ ఉన్న మరో సీజన్ అంటే డిసెంబరే. ఆ నెలలో సినిమాలకు బాగానే అనుకూలంగా ఉంటుంది. క్రిస్మస్ సెలవుల్లోనే కాక ముందు వెనుక వారాల్లో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలు రిలీజవుతుంటాయి.
ఈసారి డిసెంబరులో క్రేజీ క్లాష్ చూడబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ డిసెంబరు 6కు పుష్ప-2 ఫిక్సయింది. ఆ సినిమా వాయిదా పడుతుందన్నారు కానీ.. అలాంటిదేమీ లేదని టీం స్పష్టం చేసింది ఇటీవలే. కాబట్టి పుష్ప-2 డిసెంబరు 6న రావడం పక్కా.
మరోవైపు క్రిస్మస్ వీకెండ్ కోసం నాగచైతన్య మూవీ తండేల్‌తో పాటు నితిన్ సినిమా రాబిన్ హుడ్ ఫిక్సయ్యాయి. ఇంతలోనే మంచు విష్ణు సినిమా కన్నప్ప డిసెంబరు రేసులోకి వచ్చింది. అందులో ప్రభాస్‌తో పాటు భారీ తారాగణం ఉండడం, పాన్ ఇండియా మూవీ కావడంతో రిలీజ్ టైంలో బాగానే హడావుడి ఉంటుంది.
ఈ నాలుగు సినిమాలకు డిసెంబరులో థియేటర్లు సర్దుబాటు చేయడమే చాలా కష్టం అనుకుంటుంటే.. దసరా లేదా దీపావళి టైంలో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, బాలయ్య-బాబీ సినిమాలను కూడా డిసెంబరులో రిలీజ్ చేయడానికి చూస్తున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాల షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. పోస్ట్ ప్రొడక్షన్‌కు కూడా టైం పడుతుంది.
కాబట్టి దసరా లేదా దీపావళికి రిలీజ్ కష్టమే. సంక్రాంతికి ఆల్రెడీ బెర్తులు ఫుల్ అయిపోయాయి. కాబట్టి డిసెంబరులో రిలీజ్ చేద్దామనుకుంటున్నారట. మరి అరడజను క్రేజీ సినిమాలకు డిసెంబరులో డేట్లు, థియేటర్లు సర్దుబాటు చేయడం అంటే తలనొప్పి తప్పదన్నట్లే.
ఏపీలో వైసీపీ నాయకులను కూటమి పార్టీలు చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..ఇప్పటి వరకు కూటమిలోని టీడీపీ, జనసేన మధ్యే ఈ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…