Movie News

ఊహించని కాంబోతో సమంతా వెబ్ సిరీస్

ఖుషి తర్వాత గ్యాప్ తీసుకున్న సమంతా తిరిగి ఎప్పుడు తెరమీద కనిపిస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య స్వంత నిర్మాణంలో మా ఇంటి బంగారం ప్రకటించి చిన్న పోస్టర్ వదిలింది తప్ప అంతకు మించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించి కథలు వింటున్న సామ్ చేతికి ఒక ఇంటరెస్టింగ్ కాంబో వచ్చినట్టు లేటెస్ట్ అప్డేట్. ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ లాంటి బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ లకు దర్శకత్వం వహించిన రాజ్ అండ్ డికె త్వరలో రక్త్ భ్రమండ్ పేరుతో ఒక హారర్ వెబ్ సిరీస్ నిర్మించబోతున్నారు. దర్శకత్వం వీళ్ళు చేయడం లేదు.

2018లో తుంబాడ్ తో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న రహి అనిల్ భర్వేకి డైరెక్షన్ బాధ్యతలు ఇవ్వబోతున్నట్టు తెలిసింది. ఇది నెట్ ఫ్లిక్స్ కోసం తీయబోతున్నారు. వచ్చే ఏడాది 2025 ఆగస్ట్ స్ట్రీమింగ్ టార్గెట్ గా పెట్టుకుని నిర్మాణం చేస్తారని తెలిసింది. భారీ బడ్జెట్ తో ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ టచ్ చేయని బ్యాక్ డ్రాప్ ని ఇందులో పరిచయం చేస్తారు. ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలతో పాటు ఊహకందని మలుపులతో ఒక కొత్త అనుభూతిని రక్త్ భ్రమండ్ ఇస్తుందని యూనిట్ టాక్. సమంతాతో పాటు సిద్దార్థ్ రాయ్ కపూర్, వామికా గబ్బిలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

టైటిల్ తోనే భయపెట్టడం చూస్తుంటే కంటెంట్ నిజంగానే షాకింగ్ గా ఉండేలా కనిపిస్తోంది. రాజ్ అండ్ డీకేలు తెలుగు వాళ్లే అయినప్పటికీ ఇండియన్ ఓటిటి స్పేస్ లో తమదైన జెండా ఎగరేస్తున్నారు. సామ్ తోనే తీసిన సిటాడెల్ హనీ బన్నీ రిలీజ్ కు రెడీ అవుతోంది. గన్స్ అండ్ గులాబ్స్ కు వచ్చిన స్పందన చూసి నెట్ ఫ్లిక్స్ ఈ దర్శక ద్వయాన్ని వదిలిపెట్టడం లేదు. ప్రైమ్ కోసం ఫ్యామిలీ మ్యాన్ 3 తీస్తున్న రాజ్ అండ్ డీకే మరోపక్క ఇతర సిరీస్ ల ప్రొడక్షన్ చేస్తూ బిజీగా ఉంటున్నారు. రక్త్ భ్రమండ్ లో సమంతా పాత్ర తీరుతెన్నులు కెరీర్ బెస్ట్ అనిపించేలా ఉంటాయట.

This post was last modified on July 20, 2024 5:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరుమల కొండపై ఇక ‘చైనీస్’ దొరకదు!

కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఏడు కొండల్లో భక్తులు ఎంతో నిష్టతో సాగుతూ ఉంటారు. వెంకన్న…

57 minutes ago

హిట్ 3 విలన్ వెనుక ఊహించని విషాదం

గత వారం విడుదలైన హిట్ 3 ది థర్డ్ కేస్ లో విలన్ గా నటించిన ప్రతీక్ బబ్బర్ ప్రేక్షకుల…

1 hour ago

కశ్మీర్ లోని ఏపీ విద్యార్థుల భద్రతపై ఫోకస్

భారత్, పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితులు తప్పడం లేదు. ఎక్కడికక్కడ జనం చిక్కుబడిపోయారు.…

2 hours ago

తెలుగు జవాన్ మురళి వీర మరణం

పాకిస్తాన్ తో భారత యుద్ధం అంతకంతకూ భీకరంగా మారుతోంది. తొలుత ఉగ్రదాడి, ఆ తర్వాత కవ్వింపు చర్యలకు దిగిన పాక్..…

2 hours ago

బిగ్ బ్రేకింగ్: ఐపీఎల్‌కు బ్రేక్… బీసీసీఐ సంచలన నిర్ణయం

భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేసినట్టు…

3 hours ago

అత్తరు సాయుబు బయటకు వచ్చాడు

ఒక హిట్టు లేదా ఫ్లాపుని బట్టి డైరెక్టర్ సత్తాని అంచనా వేయలేం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోలు ఇలాంటి విషయాల్లో…

3 hours ago