ఒక్క థియేటర్లో ఓ సినిమా కోటి రూపాయల గ్రాస్ రాబడితే కొన్నేళ్ల ముందు వరకు గొప్పగాచెప్పుకునేవాళ్లం. కానీ ఇప్పుడు అది పెద్ద సినిమాలకు ఈజీ మార్క్ అయిపోయింది. మల్టీప్లెక్సుల్లో అయితే ఒకే సినిమా రెండు కోట్ల వసూళ్ల మార్కును కూడా దాటేస్తోంది. ఇప్పుడు కల్కి సినిమా హైదరాబాద్‌లోని ఫేమస్ మల్టీప్లెక్స్ ఏఎంబీ సినిమాస్‌లో సాధించిన ఘనత చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేం. అక్కడ ఈ సినిమాను లక్ష మందికి పైగా చూడడం విశేషం.
తాజాగా ఈ మల్టీప్లెక్స్‌లో లక్ష ఫుట్ ఫాల్స్ మైలురాయిని కల్కి సినిమా దాటేసింది. ఇప్పటిదాకా ఈ మల్టీప్లెక్స్‌లో రికార్డు ఆర్ఆర్ఆర్ మూవీదే. అక్కడ 99 వేల మందికి పైగా ఈ సినిమాను చూశారు. ఆ రికార్డును కల్కి అధిగమించింది. విడుదలైన 23వ రోజుకే కల్కి ఈ ఘనత సాధించింది.
నాలుగో వీకెండ్లో కూడా కల్కి సినిమా బాగా ఆడుతోంది. తర్వాతి వారాల్లో వచ్చిన సినిమాలేవీ సరిగా ఆడకపోవడం కల్కికి కలిసి వచ్చింది. ఈ వారం కూడా కల్కికి ఎదురు లేనట్లే వీకెండ్లో మంచి ఆక్యుపెన్సీలతో సినిమా నడిచే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏఎంబీలో కల్కి ఫుట్ ఫాల్స్ ఇంకా పెరగబోతున్నట్లే. ఇప్పట్లో ఆ సినిమా రికార్డును ఏ చిత్రం అధిగమించకపోవచ్చు.
ఏఎంబీలో కల్కి సినిమా నాన్ త్రీడీ వెర్షన్ ప్రస్తుతం 295 రేటుతో నడుస్తోంది. తొలి వారం ఉన్న రేట్లను బట్టి చూస్తే ఆ సినిమా అక్కడ మూడున్నర కోట్లకు పైగానే గ్రాస్ కలెక్ట్ చేసి ఉండొచ్చు. ఒక్క మల్టీప్లెక్సులో ఇంత వసూళ్లంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే కల్కి ఓవరాల్ వసూళ్లు రూ.1000 కోట్ల మార్కును దాటేసిన సంగతి తెలిసిందే. ఫుల్ రన్ అయ్యేసరికి వసూళ్లు రూ.1100 మార్కును టచ్ చేయొచ్చు.
This post was last modified on July 20, 2024 12:01 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…