కల్కి 2898 ఏడికి ఇంకో బంగారం లాంటి వారం దొరికేసింది. లాస్ట్ వీక్ భారతీయుడు 2 దారుణంగా డిజాస్టర్ కావడంతో మళ్ళీ పుంజుకున్న ప్రభాస్ నిన్న విడుదలైన కొత్త సినిమాల వల్ల ఏమైనా ప్రభావితం చెందుతాడేమో అనుకుంటే అలాంటి సూచనలు కనిపించడం లేదు.
కొత్త రిలీజులు డార్లింగ్, పేకమేడలు, ది బర్త్ డే బాయ్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదని రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. అసలే వీక్ గా ఉన్న రెస్పాన్స్ కు తోడు పలు చోట్ల భారీ వర్షాల వల్ల ఈ చిన్న చిత్రాల కోసం థియేటర్లకు జనం రావడం కష్టమే. అందుకే కల్కి మరోసారి పికప్ కావడం ఖాయం.
ముఖ్యమైన మరో విషయం ఏంటంటే నిన్న మంచి అంచనాల మధ్య వచ్చిన బాలీవుడ్ మూవీ బ్యాడ్ న్యూజ్ కంటే బుక్ మై షోలో ప్రతి గంటకు అమ్ముడవుతున్న టికెట్లలో కల్కివే అధికంగా ఉన్నాయి. దీన్ని బట్టి ఇప్పటిదాకా థియేటర్లకు వెళ్లని ప్రేక్షకులు, రిపీట్ చూడాలనుకుంటున్న ఆడియన్స్ మరోసారి దీనికే ఓటు వేస్తున్నారు.
వెయ్యి కోట్ల గ్రాస్ ని దాటేసిన ఈ విజువల్ వండర్ శని ఆదివారాల్లో మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయం. ముఖ్యంగా బిసి సెంటర్లలో నెంబర్లు గణనీయంగా పెరగబోతున్నాయని బయ్యర్ల అంచనా. ఓటిటిలో ఇప్పట్లో రాదనే వార్త వసూళ్లకు తోడ్పడుతోంది.
ఇలా మూడు నాలుగు వారాల పాటు స్ట్రాంగ్ గా ఉన్న సినిమాల్లో ఈ ఏడాది కల్కి 2898 ఏడినే నిలుస్తోంది. తర్వాతి స్థానాల్లో హనుమాన్, టిల్లు స్క్వేర్ నిలుస్తున్నాయి. కాస్త వర్షాలు తెరిపినిస్తే వసూళ్లు ఇంకా మెరుగ్గా ఉంటాయని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు. మరోవైపు వైజయంతి సంస్థ క్రమం తప్పకుండా ప్రమోషన్లు చేస్తోంది.
మూవీకి పని చేసిన నటీనటులు, టెక్నీషియన్స్ తో ఇంటర్వ్యూలు చేయిస్తూ వాటిలో విశేషాలను పంచుకుంటోంది. కల్కి పార్ట్ 2 మీద అంచనాలు క్రమంగా పెరగడం మొదలైంది. నిర్మాణానికి ఇంకో ఏడాదిన్నర పట్టొచ్చనే వార్తల నేపథ్యంలో 2026లో సీక్వెల్ ని ఆశించవచ్చు.
This post was last modified on July 20, 2024 10:43 am
ఇప్పటి దర్శకులకు వేగం అలవడటం లేదు. కారణాలు సవాలక్ష ఉండొచ్చు కానీ పరిశ్రమకు అవసరమైన స్పీడ్ అంది పుచ్చుకుని ఎక్కువ…
నాలుగేళ్ల క్రితం నాగచైతన్యతో విడిపోయి విడాకులు తీసుకున్నాక సమంత కొత్త జీవిత భాగస్వామి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం చూస్తూనే…
వైసీపీ అధినేత జగన్ .. ఇటీవల పార్టీ పార్లమెంటరీ స్థాయి ఇంచార్జ్లను నియమించారు. ఇది జరిగి దాదాపు వారం అవుతోంది.…
తెరమీద చూసే సినిమాల్లోనే కాదు కొన్నిసార్లు వాటి షూటింగుల్లో కూడా ఊహించని ట్విస్టులు ఎదురవుతూ ఉంటాయి. కెజిఎఫ్ తర్వాత మోస్ట్…
అసలే ఒకపక్క థియేటర్, ఓటిటి మధ్య గ్యాప్ తగ్గిపోతోంది ఏదో ఒకటి చేయమని అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు…
ఎంపీలకు తమ నియోజకవర్గం పరిధిలోని శాసన సభ స్థానాల పై పట్టు ఉండడం వేరు. ఎందుకంటే.. ఎంపీ లాడ్స్ నుంచి…