యానిమల్ లో బోల్డ్ గా నటించడం ద్వారా మన ప్రేక్షకులకూ కనెక్ట్ అయిపోయిన హీరోయిన్ త్రిప్తి డిమ్రి పేరు మీద ఎక్కువ మార్కెటింగ్ జరిగిన సినిమా బ్యాడ్ న్యూజ్ ఇవాళ థియేటర్లలో విడుదలయ్యింది. బాలీవుడ్ బాక్సాఫీస్ కు గత కొన్ని నెలలుగా కల్కి 2898 ఏడి తప్ప అంతగా జోష్ ఇచ్చిన మూవీ ఏదీ లేదు. అందుకే ఈ చిత్రం మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. మల్టీప్లెక్స్ అడ్వాన్స్ బుకింగ్స్ తో ముందు రోజే యాభై వేల టికెట్లకు అమ్ముడుపోవడం ఆడియన్స్ కి దీని మీద ఉన్న ఆసక్తిని తేటతెల్లం చేసింది. విచిత్రమైన పాయింట్ తో తెరకెక్కించిన బ్యాడ్ న్యూజ్ ఎలా ఉందో చూద్దాం.
వంటలు చేసే చెఫ్ గా అంతర్జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న సలోని (త్రిప్తి డిమ్రి) ఇంట్లో వాళ్ళ పోరు పడలేక చిన్న దుకాణం నడుపుకునే అఖిల్ చద్దా (విక్కీ కౌశల్) ని పెళ్లి చేసుకుంటుంది. అయితే హానీమూన్ లోనే గొడవలు వచ్చి విడాకుల దాకా వెళ్తారు. వృత్తిలో భాగంగా ముస్సోరికి వెళ్లిన సలోనికి అక్కడ గుర్బీర్ పన్ను (అమీ విర్క్ )కు దగ్గరవుతుంది. ఆ సమయంలో ప్రెగ్నెంట్ అయితే అఖిల్, గుర్బీర్ కు సంబంధించిన కవలలు గర్భంలో ఉన్నారని డాక్టర్లు చెబుతారు. దీంతో తండ్రులిద్దరూ రంగంలోకి దిగాక జరిగే పరిణామాలే బ్యాడ్ న్యూజ్ స్టోరీ.
దర్శకుడు ఆనంద్ తివారి తీసుకున్న కాన్సెప్ట్ సంక్లిష్టంగా ఉన్నా నవ్వించడమే ప్రధానంగా ట్రీట్ మెంట్ రాసుకున్నాడు. అయితే బలమైన కథనం, సన్నివేశాలు తక్కువగా ఉండటంతో ఆశించిన స్థాయిలో బ్యాడ్ న్యూజ్ ఎంటర్ టైన్ చేయదు. ముఖ్యంగా సెకండాఫ్ లో విక్కీ కౌశల్, అమీ విర్క్ లు కలుసుకున్నాక జరిగే ఎపిసోడ్లను అవసరానికి మించి సాగదీశారు. ఇక్కడ సీన్లు రిపీట్ అనిపించి ఒకదశ తర్వాత బోర్ కొట్టేస్తాయి. విక్కీ తన భుజాల మీదే అధిక భారం మోశాడు. యాక్టింగ్ పరంగా త్రిప్తి డిమ్రి ఇంకా మెరుగు పడాల్సింది చాలా ఉంది. బాలీవుడ్ జనాలకు నచ్చవచ్చేమో కానీ మనకీ బ్యాడ్ న్యూజ్ ఒంటబట్టడం డౌటే.
This post was last modified on July 19, 2024 8:51 pm
టాలీవుడ్ లో వరస అవకాశాలు వస్తున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి టాప్ త్రీలో ఉంది. హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే కాల్…
జగన్ హయాంలో అనేక తప్పులు జరిగాయని సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే.. మరీ ముఖ్యంగా కొన్ని తప్పుల కారణంగా.. రాష్ట్రం…
సూర్య ప్యాన్ ఇండియా మూవీ కంగువాకు బాక్సాఫీస్ వద్ద వస్తున్న స్పందన చూసి అభిమానులు సంతోషంగా లేరన్నది ఓపెన్ సీక్రెట్.…
కాపు ఉద్యమ మాజీ నాయకుడు, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో…
వైసీపీ హయాంలో పవిత్రమైన, గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో ఉన్న తమను పాఠశాలల్లో మరుగుదొడ్ల పర్యవేక్షణకు, మద్యం షాపుల దగ్గర విధులకు…
వైసీపీ హయాంలో అనుకున్న దానికన్నా రాష్ట్రంలో విధ్వంసం ఎక్కువగానే జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో…