Movie News

పుష్ప-2 సెట్ రైట్.. కానీ బన్నీ ఇప్పుడే రాడు

గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో చర్చలన్నీ ‘పుష్ప-2’ సినిమా చుట్టూనే తిరుగుతన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని.. దర్శకుడు సుకుమారేమో యుఎస్‌కు వెళ్లిపోతే, హీరో అల్లు అర్జునేమో ఇంకేదో దేశానికి ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లిపోయాడని.. దీంతో షూట్ సంగతి ఎటూ తేలకుండా తయారైందని.. డిసెంబరు 6కు కూడా సినిమా విడుదల కావడం కష్టమే అని ప్రచారం సాగింది.

ఐతే యూనిట్లో పరిస్థితులు మరీ అంత తీవ్రంగా ఏమీ లేవని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ తన కూతురి చదువుకు సంబంధించి కుటుంబంతో కలిసి యుఎస్ వెళ్లాడు తప్ప వేరే కారణం లేదని.. తనకు కొంచెం బ్రేక్ దొరకడంతోనే బన్నీ గడ్డం తీసి ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లాడని అంటున్నారు. ఐతే సుకుమార్ ఆల్రెడీ హైదరాబాద్‌లో అడుగు పెట్టేయగా.. చిత్రీకరణ కూడా మరి కొన్ని రోజుల్లో పున:ప్రారంభం కాబోతోందని కూడా చెబుతున్నారు. కానీ బన్నీ పునరాగమనం ఎప్పుడన్న దాని మీదే సస్పెన్స్ నెలకొంది.

సుకుమార్ తిరిగి చిత్రీకరణ మొదలుపెట్టినా.. గడ్డం ట్రిమ్ చేసి కనిపిస్తున్న బన్నీతో కంటిన్యుటీ సీన్లు తీయడం ఎలా అనే చర్చ మొదలైంది. కానీ యూనిట్ వర్గాల సమాచారం ఏంటంటే.. బన్నీ వెంటనే పుష్ప-2 సెట్లోకి అడుగు పెట్టబోడట. కొన్ని వారాలు విరామం తీసుకుంటున్నాడట.

సినిమాలో బన్నీకి సంబంధించి చిత్రీకరణ మిగిలి ఉన్నది క్లైమాక్స్ ఫైట్, ఒక పాట మాత్రమేనట. అతను తిరిగొచ్చేలోపు బన్నీతో సంబంధం లేని సన్నివేశాలను సుకుమార్ చిత్రీకరించనున్నాడట. బన్నీ రాగానే క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణ చేస్తారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి మధ్యలో కొంచెం వీలు చేసుకుని ఐటెం సాంగ్ చిత్రీకరణ సాగిస్తారు. ఇదంతా పక్కాగా ప్లాన్ చేసుకున్నారని.. సినిమా విడుదల తేదీ మారే సమస్యే లేదని.. డిసెంబరు 6కు ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్ప-2 థియేటర్లలోకి దిగుతుందని.. అభిమానులు కంగారు పడాల్సిన పని లేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

This post was last modified on July 19, 2024 9:45 am

Share

Recent Posts

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

10 minutes ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

3 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

3 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

3 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

5 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

5 hours ago