ఒకవేళ భారతీయుడు 2 కనక బ్లాక్ బస్టర్ అయ్యుంటే ఆరు నెలలు తిరక్కుండానే మూడో భాగం రిలీజ్ చేయాలనేది ముందు అనుకున్న ప్లాన్. దానికి అనుగుణంగానే దర్శకుడు శంకర్ తన టీమ్ తో కలిసి దాని పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేయిస్తూ వచ్చారు. ఇంకో రెండు మూడు వారాల ప్యాచ్ వర్క్ షూట్ తప్ప ఇండియన్ 3కి సంబంధించిన ఫుటేజ్ మొత్తం సిద్ధంగా ఉంది. అయితే కమల్ హాసన్ సూచన మేరకు ఇప్పుడీ నిర్ణయంలో మార్పు జరగబోతున్నట్టు తెలిసింది. సీక్వెల్ మీద విపరీతమైన నెగటివిటీ వచ్చిన నేపథ్యంలో కొంత కాలం ఆగి చూద్దామని లైకాకు చెప్పినట్టు చెన్నై టాక్.
ప్రస్తుతం కమల్ తగ్ లైఫ్ చిత్రీకరణలో బిజీ కాబోతున్నారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాని రాజ్ కమల్ బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇండియన్ 3 స్థానంలో దీన్ని రిలీజ్ చేసే ఆప్షన్ ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. వేరే బ్యానర్ అయ్యుంటే ఇబ్బందేమో కానీ స్వంత ప్రొడక్షన్ కావడంతో కమల్ ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్న తగ్ లైఫ్ లో శింబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే మణిరత్నం ఎంత వేగంగా షూటింగ్ పూర్తి చేయగలరు అనే దాని మీద రిలీజ్ డేట్ ఆధారపడి ఉంటుంది.
మొన్న ఏడాది విక్రమ్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ ఆనందం ఇండియన్ 2 నిలువునా ఆవిరి చేయడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచిన సినిమా బ్రాండ్ ని అవసరంగా డ్యామేజ్ చేశారని శంకర్ మీద మండిపడుతున్నారు. వాళ్ళ ఆవేదనలో న్యాయముంది. ఇప్పటి తరం ఒక బ్యాడ్ మూవీగానే ఇండియన్ 2ని గుర్తు పెట్టుకుంటారు. స్టంట్ మాస్టర్స్ అన్బు అరివులను దర్శకులుగా పరిచయం చేస్తూ హీరోగా నటిస్తున్న కమల్ దాన్ని 2025 ద్వితీయార్థంలో ప్లాన్ చేస్తున్నారు. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి తరహాలో కమల్ హాసన్ ఇప్పట్లో శంకర్ షాక్ మర్చిపోయేలా లేరు.
This post was last modified on July 18, 2024 5:58 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…