ఇరవై రోజులు దాటుతున్నా కల్కి 2898 ఏడి వార్తల్లో నిలవడం మాత్రం ఆగడం లేదు. వెయ్యి కోట్ల గ్రాస్ దాటేసి క్రమంగా నెమ్మదిస్తుందని అనుకుంటున్న టైంలో ఏదైనా సెలవు రోజు వస్తే చాలు ఒక్కసారిగా బుకింగ్స్ ఊపందుకుంటున్నాయి. నిన్న మొహరం, తొలి ఏకాదశి సెలవు ఒకేసారి కలిసి రావడంతో ప్రధాన కేంద్రాలన్నీ హౌస్ ఫుల్స్ తో కళకళలాడాయి. మొదట్లో టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని భావించిన ఫ్యామిలీ ఆడియన్స్ రెండో వారం నుంచి అవి తగ్గడంతో థియేటర్లకు వస్తున్నారు. భారతీయుడు 2 దారుణంగా నిరాశ పరచడం కల్కికి దక్కిన మరో వరం. ఇక అసలు విషయం వేరే ఉంది.
ఆన్ లైన్ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో కల్కి 2898 ఏడి అత్యధిక టికెట్లు అమ్మిన తొలి ఇండియన్ సినిమాగా సరికొత్త రికార్డు నమోదు చేసుకుంది. మూడో వారంలోకి అడుగు పెడుతున్న తరుణంలో 12.15 మిలియన్ల టికెట్లు సేల్ అయిన మూవీగా నెంబర్ వన్ సింహాసనాన్ని అందుకుంది. ఇప్పటిదాకా ఈ మైలురాయి షారుఖ్ ఖాన్ జవాన్ (12.01) పేరు మీద ఉంది. కల్కి ఫైనల్ రన్ ఇంకా అవ్వలేదు. చాలా ఏరియాలలో స్ట్రాంగ్ గా ఉంది. ఇంకో వారం పది రోజులు మంచి స్పీడ్ ఉంటుందని బయ్యర్లు అంచనా వేస్తున్నారు. రేపు వచ్చేవి చిన్న సినిమాలు కాబట్టి పోటీ పరంగా ఇబ్బందేమీ ఉండదని అంటున్నారు.
చూస్తుంటే ఇతర హీరోలకు ప్రభాస్ ఏ రికార్డు మిగిలించేలా లేడు. ఒక్కొక్కటిగా అన్నీ తుడిచిపెడుతున్నాడు. సలార్ లాంటి మిక్స్డ్ టాక్ వచ్చినప్పుడే ఆగని డార్లింగ్ బ్లాక్ బస్టర్ వస్తే నిలువరించడం ఎవరి వల్ల అవుతుంది. ఈ లెక్కన బుక్ మై షోలో 15 మిలియన్ టికెట్లు అమ్మిన సినిమాగా కల్కి సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించే రోజు దగ్గర్లోనే ఉందని స్పష్టమవుతోంది. దీన్ని క్రాస్ చేయడం మాత్రం అంత సులభంగా కాదనే చెప్పాలి. దర్శకుడు నాగ్ అశ్విన్ టేకింగ్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి స్టార్ల పాత్రలు, కళ్ళు చెదిరే విజువల్స్ మళ్ళీ ఇంతకు మించి మేజిక్ చూపిస్తేనే కల్కిని దాటొచ్చు.
This post was last modified on July 18, 2024 12:37 pm
రేపు, ఎల్లుండి బాక్సాఫీస్ కు నాలుగు కొత్త రిలీజులు ఉన్నాయి. మాములుగా అయితే సందడి ఓ రేంజ్ లో ఉండాలి.…
నాయకుడు అన్న వ్యక్తి.. హుందాగా వ్యవహరించాలి. పైగా.. గతంలో ఉన్నస్థాయి పదవులు అలంకరించిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే..…
భారత రిజర్వ్ బ్యాంకు బుధవారం దేశ ప్రజలకు మరోమారు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే గత త్రైమాసిక సమీక్షలో భాగంగా…
బాలీవుడ్ మొదటి సూపర్ హీరో బ్లాక్ బస్టర్ గా నిలిచిన క్రిష్ కు కొనసాగింపుగా క్రిష్ 4 త్వరలో ప్రారంభం…
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పాలనను డిటిజల్ రూపంలోకి మారుస్తున్నారు. ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా.. చేసిన ప్రయోగం సక్సెస్…
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, విపక్షంలోకి మారితే మరోలా మాట్లాడుతున్న వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుపై పోలీసు…