ప్రభాస్ నటించిన “కల్కి 2898 AD” సినిమా టాలీవుడ్ తో పాటు ఇండియాలో కూడా భారీ విజయం సాధించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు నెలల నిర్జీవతకు ఎండ్ కార్డ్ వేసింది. ఈ విజయం తర్వాత టాలీవుడ్ పునర్జీవనం పొందింది. ఇప్పుడు, “కల్కి” వచ్చిన మూడు వారాల తర్వాత చిన్న సినిమాల హడావుడి మళ్లీ ప్రారంభమైంది. ఈ వారంలో ప్రియదర్శి మరియు నభా నటేష్ జంటగా నటించిన “డార్లింగ్” ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.
ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. అమెరికాలోనే ఈ సినిమా 200కి పైగా థియేటర్లలో విడుదల కానుంది, మరియు ఓవర్సీస్ మొత్తం 350 వరకు థియేటర్లలో విడుదల కానుంది. ఒక చిన్న సినిమాను ఈ స్థాయిలో విడుదల చేయడం సులభం కాదు. ఈ సంవత్సరంలో “హనుమాన్” తో అదరగొట్టిన నిర్మాతలు ఈ సినిమాను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు.
అన్ని చోట్లా గ్రాండ్‌గా విడుదల చేస్తున్న ఈ సినిమాకు మంచి బజ్ ఉండటంతో, ప్రేక్షకుల స్పందన పర్వాలేదనిపిస్తే, బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఈ క్రమంలో “డార్లింగ్” సినిమా విడుదలపై చిన్న సినిమాల బయ్యర్లు సైతం హోప్స్ పెట్టుకున్నారు. కేవలం కల్కి లాంటి బిగ్ మూవీస్ మాత్రమే కాకుండా ఇలాంటి చిన్న సినిమాలను కూడా ఆదరిస్తే బావుంటుందనే ఆశతో ఉన్నారు. ఇక బలగం సినిమాతో బిగ్ సక్సెస్ అందుకున్న యువ హీరో ప్రియదర్శి డార్లింగ్ తో మరోసారి తన మార్కెట్ రేంజ్ ను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. మరోవైపు హీరోయిన్ నభా నటేష్ కూడా ఒక సాలీడ్ హిట్ కోసం చూస్తోంది. కాబట్టి ఈ సినిమాతో సక్సెస్ అందుకోవడం ఆమెకు చాలా అవసరం.
This post was last modified on July 17, 2024 3:55 pm
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…